Charmi latest movie update

actress charmi, heroine charmi latest movie update,prema oka maikam, telugu movie prema oka maikam, charmi role as prostitute, soni charmishsta, tagubotu ramesh, chandramohan

charmi latest movie update

5.gif

Posted: 11/06/2012 07:28 PM IST
Charmi latest movie update

charm

చార్మింగాళ్.. చార్మి విభిన్నమైన పాత్రలో దర్శనమివ్వబోతోంది.  ఆమె నటిస్తోన్న తాజా చిత్రంలో 'వేశ్య' పాత్ర ధరిస్తోంది. ఈ చిత్ర టైటిల్.. 'ప్రేమ ఒక మైకం'. టెన్త్‌ క్లాస్‌, నోట్‌బుక్‌ చిత్రాల దర్శకుడు చందు దర్శకత్వంలో టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై డి.వెంకట సురేష్‌, కె.సూర్య శ్రీకాంత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
        'హ్యాపీడేస్‌' రాహుల్‌, 'ప్రేమిస్తే' శరణ్య జంటగా నటిస్తోన్న ఈ మూవీ ఇప్పటికి చిత్రీకరణ 80 శాతం పూర్తయింది. మూవీ అప్ డేట్ ఏమని అడిగితే దర్శకుడు ఇలా అంటున్నారు.  ‘వెండితెరపై వేశ్య పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది. సావిత్రి, జయసుధ, జయప్రద, శ్రీదేవి, లక్ష్మి ప్రభ, టబు, కరీనాకపూర్‌, అనుష్క వంటి కథానాయికలంతా వేశ్య పాత్రల్లో బాగా రాణించారు. ఆ స్థాయిలో 'వేశ్య'లో చార్మి పాత్ర ఉంటుంది. ఎంతో శ్రద్ధ తీసుకుని ఈ పాత్రను తీర్చిదిద్దుతున్నాం. ఇదొక మ్యూజికల్‌ లవ్‌స్టోరీ. ఒక వేశ్యకు, రచయితకు, గాయనికి మధ్య జరిగే కథ ఇది’ అని చెప్పారు.
       ఇటీవలే గోవాలో ఓ కీలకమైన షెడ్యూల్‌ లో చార్మిపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రసుత్తం ఫిలింసిటీలో కొన్ని సీన్లు షూట్‌ చేస్తున్నారు. ఈనెలాఖరుకు షూటింగ్‌ పూర్తి చేయాలని చిత్ర వర్గం సన్నాహాలు చేస్తోంది.  ఇందులో మొత్తం 8 పాటలున్నాయి.
        సోనీ చరిష్టా, సతీష్‌, చంద్రమోహన్‌, రావు రమేష్‌, తాగుబోతు రమేష్‌, పృథ్వీ, సురేఖావాణి, చంటి, జాకీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పులగం సి. నారాయణ, కెమెరా: ప్రవీణ్‌ బంగారి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ravi teja mass song in saar vastaru movie
Kamal hassan viswaroopam 3d trailer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles