Krishanm vande jagadgurum movie release date

krishanm vande jagadgurum movie,rana daggubati, rana, rana nayana tara movie, krishnam vande kiran jagadgurum movie update, krishnam vande jagadgurum wall papers, krish latest movie kvj movie release date,

krishanm vande jagadgurum movie release date

15.gif

Posted: 11/06/2012 07:10 PM IST
Krishanm vande jagadgurum movie release date

rana-and-nayatara-hot-still_inn

టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి హీరోగా నటించిన కమర్శియల్ ఎంటర్టైనర్ ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ఈ సినిమాని నవంబర్ 30న విడుదల చేయాలని ఖరారు చేశారు. నిన్న రాత్రి వరకూ ఈ సినిమాని నవంబర్ 9న విడుదల చేయాలని భావించారు. కానీ ఈ రోజు ఉదయం డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఫైనాన్సియర్స్ తో సంప్రదింపులు జరిపిన తర్వాత చివరగా ఈ సినిమాని నవంబర్ 30న విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా,  నాగార్జున నటించిన ‘డమరుకం’ ఈ నెల 9న విడుదలకు సిద్దమవుతోంది, అలాగే 23న కూడా పలు సినిమాలు విడుదల కానుండడంతో ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ సినిమాని నవంబర్ 30న విడుదల చేయడం సరైన సమయం అని భావించారని తెలుస్తోంది.
         జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకుడు. జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్‌డ్డి నిర్మాతలు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈమూవీ యు.ఎ. సర్టిఫికెట్ దక్కించుకుంది. ఇంతకీ ఈ మూవీ భావం ఏమిటని అడిగితే క్రిష్ ఇలా బదులిచ్చారు.. ‘మా గురు సిరి భగవద్గీత తత్వం గురించి చెప్పిన చిన్న లైన్ ఆధారంగా ఈ చిత్ర కథను తయారుచేశాను. పరులకు ఉపకారం చేసేవావరైనా దేవునితో సమానం. దేవుడంటే ఎవరో కాదు. సాయం చేసేవారు ఎవరైనా దేవుడి అవతారమే అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ చిత్ర కథ వుంటుంది. అంతర్లీనంగా కృష్ణతత్వం వున్న ఇతివృత్తమిది. బి.టెక్ బాబు పాత్రలో రానా సరికొత్తరూపంలో కనిపిస్తారు. సినిమాలో 20నిమిషాల పాటు నాటక నేపథ్యముంటుంది. యాడ్ ఫిల్మ్‌ మేకర్ దేవిక పాత్రలో నయనతార అభినయం సినిమాకు ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది. యాక్షన్ ఎడ్వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రంలో గొప్ప మానవీయ విలువలు మేళవించి వుంటాయి. సమాజానికి అవసరమయ్యే చక్కటి సందేశం వుంటుంది.’ అని వెల్లడించారు.
        ఇక ఈ చిత్రానికి బుర్రా సాయిమాధవ్ అద్భుతమైన సంభాషణల్ని సమకూర్చారు. మణిశర్మ బాణీలు. కెమెరా: జ్ఞానేశ్వర్, మాటలు: బుర్రా సాయిమాధవ్, పాటలు: సిరి సీతారామశాస్త్రి. ...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arjun tapsi amalapaul movie update
Maheshbabu gowtham menon movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles