Cameramn gangato rambabu movie screening troubles

cameramn gangato rambabu movie screening troubles, telangana agitaters, and tdp leaders oppose film screening

cameramn gangato rambabu movie screening troubles

11.png

Posted: 10/19/2012 01:48 PM IST
Cameramn gangato rambabu movie screening troubles

New_wallposters_of_Cameraman_Gang_eee

       పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాకు తెలంగాణ సెగ తగిలింది. కొద్దిసేపటిక్రితం జూబ్లీహిల్స్ లోని సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ కార్యాలయంపై తెలంగాణవాదులు దాడి చేశారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. మూడు కార్లకు కూడా ధ్వంసం చేశారు. సినిమాలో తెలంగాణవాదులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని వారు నిరసన తెలిపారు. ఆ చిత్రాన్ని వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.
          ఈ సినిమా మీద తెలంగాణ జిల్లాల్లోనూ నిరసనల వెల్లువెత్తాయి. తెలంగాణవాదులు పలుచోట్ల థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేయాలని ఆందోళనకు దిగారు. నల్గొండ నటరాజు థియేటర్, నకిరేకల్ రామకృష్ణ థియేటర్లో తెలంగాణవాదులు చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఎమ్మెల్యే అరవింద రెడ్డి ఈ సినిమా చిత్ర ప్రదర్శనను అడ్డుకున్నారు. ఖమ్మం జిల్లా పాల్వంచలో ఈ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ పై తెలంగాణవాదులు దాడి చేసి, ప్రదర్శనను అడ్డుకున్నారు.
         ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే వివాదాస్పద సన్నివేశాలు, మాటలు తొలగిస్తామని కెమెరామెన్ గంగతో రాంబాబు దర్శకుడు పూరీ జగన్నాథ్ చెప్పారు.
       మరోవైపు.. ఈ సినిమాలో తెలంగాణాకి విరుద్దంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఉస్మానియా యునివర్సిటీ విద్యార్థులంతా కలిసి హైదరాబాద్ లోని ఆరాధన థియేటర్లో సినిమా ప్రదర్శించకుండా ఆపివేశారు. తెలంగాణా ప్రాంతంలో ఎక్కడా ఆ సినిమా ప్రదర్శించకూడదని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్లో తెలంగాణా వాదులు సినిమా ప్రదర్శన నిలిపివేసి, ఈ సినిమా కటౌట్స్ ని తగలబెట్టారు మరియు థియేటర్ అద్దాలు  పగల కొట్టారు. ఈ సినిమాలో జాతీత్య సమైక్య వాదం గురిచి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కానీ తెలంగాణాని నేరుగా కించ పరిచే డైలాగ్స్ ఏమీ లేవు. ఈ సమస్యను ఆపడానికి ధర్నా చేస్తున్న తెలంగాణా వాదులతో ప్రస్తుతం ఈ చిత్ర ప్రొడక్షన్ టీం, డిస్ట్రిబ్యూటర్స్ మంతనాలు జరుపుతున్నారు.
        ఇదిలా ఉండగా,  ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా యు.ఎస్ లో జరిగిన ప్రీమియర్ షోల కలెక్షన్స్ తో రికార్డ్ నెలకొల్పింది. సుమారుగా 75-80 లక్షల షేర్ సంపాదించింది. ఇలాంటి కలెక్షన్స్ ఇప్పటివరకూ ఏ సినిమాకి రాలేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా బెనిఫిట్ షో కి మంచి కలెక్షన్స్ వచ్చాయని సమాచారం. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ తో అదిరిపోయే ఓపెనింగ్స్ తో నిన్న సినిమా విడుదలైంది మరియు దసరా సెలవులు కూడా కలిసి వచ్చాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన మరియు అతని స్టార్ ఇమేజ్ ఈ చిత్ర విజయానికి బాగా సాయపడ్డాయి. పవన సరసన తమన్నా కథానాయికగా నటించారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dk aruna fire on cameramen gangato rambabu movie
Srikanth sing a song for his forthcoming movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles