Manchu vishnu denikainaready music review

manchu vishnu denikainaready music review total five songs

manchu vishnu denikainaready music review

19.png

Posted: 10/07/2012 04:56 PM IST
Manchu vishnu denikainaready music review

Denikaina-Readyee

మంచు విష్ణు తన కొత్త సినిమా ‘దేనికైనా రెడీ’ దసరా రేసులో నిలిచింది. గతంలో సీమ టపాకాయ్, సీమ శాస్త్రి వంటి సినిమాలని తెరకెక్కించిన జి నాగేశ్వర రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 24 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విష్ణు గతంలో నటించి సూపర్ హిట్ అయిన ‘ఢీ’ సినిమా తరహాలోనే ఈ సినిమాని కూడా యాక్షన్ విత్ 100% ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కించారు. విష్ణు సరసన హన్సిక నటించిన ఈ సినిమాని 24 ఫ్రేమ్స్ బ్యానర్ పై ఎమ్. మోహన్ బాబు నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా, చక్రి కలిసి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలైంది. ఇప్పుడు ఈ ఆల్బం ఎలా ఉందో చూద్దాం..
1) పాట : నాలాగే నేనుంటాను
గాయకులు : శంకర్ మహదేవన్
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి
హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఇది.  ఈ పాటను యువన్ శంకర్ రాజ స్వరపరిచారు. శంకర్ మహదేవన్ గాత్రం ఈ పాటలో మరింత ఊపుని తెచ్చిపెట్టింది. ఈ పాట టిపికల్ యువన్ పాటలా మంచి ఎనర్జీతో సాగుతుంది.
2)పాట : పిల్లందం కేక కేక
గాయకులు : హేమచంద్ర, పర్ణిక
సాహిత్యం :చంద్రబోస్జర్నీ సాంగ్ ఇది. హేమ చంద్ర వాయిస్ బావుంది. చక్రి అందించిన సంగీతం ఈ పాటకు బాగా మ్యాచ్ అయింది.
3) పాట : నిన్ను చూడకుండా
గాయకులు : అద్నాన్ సమీ, గీత మధురి
సాహిత్యం : భాస్కర భట్ల
ఈ రొమాంటిక్ డ్యూయట్ లో ఇద్దరు ప్రతిభావంతులయిన గాయకులు అద్నాన్ సమీ, గీత మధురి పాడారు. ఈ పాటకి కావలసిన ఎనర్జీ తో పాటు కావలసిన ఫీల్ ని కలిగించారు. మంచి అందమయిన ప్రదేశాలలో ఈ పాట చిత్రీకరణ ఉండవచ్చు. భాస్కరభట్ల మంచి సాహిత్యం అందించారు.
4)పాట : పిల్ల నీవల్ల
గాయకులు : యువన్ శంకర్ రాజ, శ్రద్ద పండిట్
సాహిత్యం :అనంత శ్రీరామ్
పిల్ల నీవల్ల పాట సున్నితమయిన మెలోడి పాట. ఈ పాటను యువన్ శంకర్ రాజ స్వరపరిచారు. ఈ పాట నెమ్మదిగా అందరికి నచ్చుతుంది. అనంత శ్రీ రామ్ రచించిన సాహిత్యం మంచి ఫీల్ ని ఇస్తాయి. యువన్ శంకర్ రాజ మరియు శ్రద్ద పండిట్ వారి గొంతుతో పాటకు న్యాయం చేశారు ఆహ్లాదకరమైన పాట ఇది.
5) పాట : పంచె కట్టుకో
గాయకులు : టిప్పు,శ్రవణ భార్గవి
సాహిత్యం :భాస్కరభట్ల
పూర్తి మాస్ బీట్ తో సాగే మాస్ సాంగ్ ఇది. పాటలో ఫుల్ ఎనర్జీ ఉంది. భాస్కర భట్ల అందించిన సాహిత్యం చక్రి అందించిన సంగీతం పాటకి మంచి ఊపునిచ్చే అవకాశం ఉంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Orange movie in tamil title ramcharan
Maheshbabu kruthi sanan pair  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles