Ram charan lawrence new movie

ram charan lawrence new movie, starts soon,

ram charan lawrence new movie

1.png

Posted: 10/06/2012 02:01 PM IST
Ram charan lawrence new movie

ram_charan_innerమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నాయక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇవాళ (శనివారం) కొంపల్లి లోని సినీ పాన్లెట్ లో జరిగుతోంది. హీరో రామ్ చరణ్, అమాలాపాల్, వేణు మాధవ్ తదితరులుపై కొన్ని వినోదాత్మక సన్నివేశాలను సినీ ప్లానెట్ లో దర్శకుడు వినాయక్ చిత్రీకరించారు. కాగా, నాయక్ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మార్చి నెలలో ఆడియో విడుదల చేస్తారు.          ఇదిలా ఉండగా,  దర్శకుడిగా తన ప్రతిభ చాటుకుంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన తదుపరి చిత్రాన్ని రామ్ చరణ్ తో చేయాలని తపిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. చరణ్ క్రేజ్ - ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని లారెన్స్ ఓ కథను రెడీ చేశాడనీ, ఆ కథను అతనికి వినిపించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడని అంటున్నారు. లారెన్స్ కొరియో గ్రాఫర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాక, మెగా ఫ్యామిలీతో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటూ వచ్చాడు.  రామ్ చరణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకునే ముందు డాన్స్ విషయంలో లారెన్స్ కొంత శిక్షణ కూడా ఇచ్చాడు. అందువల్ల లారెన్స్ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అయితే 'రెబల్' సినిమా నిర్మాణం విషయాలో జరిగిన ఆలస్యానికి లారెన్స్ ప్రధాన కారణమనే ప్రచారం జరిగింది. అలాగే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ముందుకి దూసుకుని వెళ్లకపోవడానికి కారకుడు కూడా అతనేనంటూ విమర్శలూ వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రభావం లారెన్స్ తదుపరి చిత్రం పై పడుతుందా ... లేదా అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ఆసక్తికరంగా మారింది.  

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan gangato rambabu
Rana krishnam vande jagadgurum  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles