Suttivelu life history

suttivelu life history

suttivelu life history

11.gif

Posted: 09/17/2012 01:29 PM IST
Suttivelu life history

      sutti_11 సినీరంగాన్ని తన నవ్వుల సవ్వడులతో ఊయలూగించిన ఆయన స్వర్గతీరాలకు చేరుకున్నారు. ఆయన మరెవరో కాదు అందరికీ సుపరిచితులు ‘సుత్తివేలు’. తెలుగు చిత్రసీమలోని హాస్యనటుల్లో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న ఆయన ఇకలేరు అని చెప్పడానికే నోరు పెగలని పరిస్థితి. సుత్తివేలు వయస్సు 62 సంవత్సరాలు. తన అభినయంతో కొన్ని దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను చక్కిలి గింతలు పెట్టిన సుత్తివేలు, ఆదివారం ఉదయం చెన్నరులో గుండెపోటుతో మరణించారు. ఆయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీనరసింహారావు. హాస్యబ్రహ్మ రూపొందించిన 'ముద్ద మందారం' చిత్రం ద్వారా ఆయన సినీ రంగానికి పరిచయమయ్యారు. ఆ తర్వాత నటించిన 'నాలుగు స్తంభాలాట' చిత్రం ఆయనకు ఎంతోపేరు తెచ్చింది. 2009లో వచ్చిన 'శశిరేఖ పరిణయం' ఆయన ఆఖరి చిత్రం. 'ప్రతిఘటన' చిత్రానికిగానూ 1985లో బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌గా నంది అవార్డు అందుకున్నారు. దూరదర్శన్‌లో ప్రసారమైన 'ఆనందోబ్రహ్మ' అనే కార్యక్రమం చాలా పాపులర్‌ అయింది. తనదైన బాడీలాంగ్వేజ్‌, విలక్షణమైన sutti_2.21డైలాగ్‌ డెలివరీతో అశేష ప్రేక్షకులను నాన్‌స్టాప్‌గా నవ్వించారు. పోలీస్‌ పాత్రల్లోనూ, సగటు తండ్రిపాత్రల్లోనూ తనదైన ముద్రవేశారు. రెండుజెళ్ల సీత, శ్రీవారికి ప్రేమలేఖ, రెండు రెళ్లు ఆరు, రేపటి పౌరులు, ప్రతిఘటన, కలికాలం...మొదలైన చిత్రాలు ఆయన కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. జంధ్యాల సినిమాల్లో కథా వస్తువుగా హాస్యమనేది ఎలా కనిపిస్తుందో, ఆ హాస్యాన్ని నడిపించేవారిలో సుత్తివేలు తప్పనిసరిగా కనిపించేవారు. ఇకతెరపై సుత్తి వీరభద్రరావు-సుత్తివేలు కలిసి 'సుత్తిజంట'గా చేసిన సందడి అంతా ఇంతా కాదు. సినిమాలో నాయకా నాయికలు ఎవరైనా, వాల్‌పోస్టర్‌పై సుత్తిజంట వున్నారా ! లేదా ! అని ప్రేక్షకులు చూసేవారు. జంధ్యాల సృష్టించిన ఈ 'సుత్తి' అనేపదం వచ్చి, ఇద్దరి పేర్లకు ముందు ఒద్దికగా ఒదిగిపోయింది. అంతలా వాళ్లిద్దరూ కామెడీని కలిసి నడిపించారు. కలిసి గెలిపించారు.

      sutti_4 సుత్తివేలుకు నవ్వించడం మాత్రమే తెలుసు.. అనుకునేవాళ్లు ఆయన నటించిన 'ప్రతిఘటన', 'కలికాలం' చిత్రాలు చూసి ప్రేక్షకుడు నివ్వెరపోయాడు. 'ప్రతిఘటన'లో అవినీతిపరుల అన్యాయానికి గురైన వ్యక్తి పాత్రలో కనిపిస్తారు. వాళ్లను ఏమీచేయలేని నిస్సహాయతతో మతిస్థిమితం లేని వ్యక్తిలా కనిపిస్తాడు. సమాజం పోకడ పట్ల అసహనాన్ని, ఆవేదనని వ్యక్తం చేసే ఈ పాత్రను చూసినవాళ్లు, ఆయన ఓ సాదాసీదా నటుడు కాదనే విషయాన్ని కనిపెట్టేశారు. ఇక 'కలికాలం' చిత్రంలో బాధ్యతలేని ఓ తాగుబోతు తండ్రిగా, ఆ తర్వాత మారిపోయిన మనిషిగా ఆయన నటన ప్రేక్షకులచే ఔరా ! అనిపించారు. సుత్తివేలుకు నవ్వించడమే కాదు, ఏడిపించడమూ తెలుసునని నిరూపించారు. ఇలా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎన్నో ఉదాత్తమైన పాత్రలను పోషించిన సుత్తివేలు బుల్లితెర ధారావాహికలపై కూడా తనదైన ముద్ర వేశారు. 'ఆనందోబ్రహ్మ' ధారావాహికలో ఆయన అల్లరిని ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. sutti_3_copy.jpg3

     ఆయనకు అసలు సుత్తివేలు అనే పేరెలావచ్చిందంటే... చిన్నప్పుడు ఆయన సన్నగా, బక్కపలచగా వుండేవారు. దాంతో సన్నిహితులు 'వేలు'లా ఉన్నాడంటూ పిలిచేవారు. అలాగే 'నాలుగు స్తంభాలాట' సినిమాలో ఆయన పాత్ర పేరు సుత్తి. దాంతో ఈ రెండు పేర్లూ కలిపి తన పేరును సుత్తివేలుగా మార్చుకున్నారాయన. సుమారు 250 చిత్రాలలో నటించిన వేలు, కేవలం హాస్యపాత్రలే కాకుండా కంటతడి పెట్టించే కారెక్టర్‌ వేషాలూ వేశారు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు వున్నారు.

     చెన్నరులో నిన్న సాయంత్రం ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుత్తివేలు మరణవార్త తెలిసి, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయనీ రోజు లేరన్న విషయం తెలిసిన సినీ ప్రేక్షుకుడు ఎంతగానో బాధపడుతున్నాడు. ఆయన ఆత్మకు శాంతికలగాలని తెలుగువిశేష్.కాం ప్రార్థిస్తోంది..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cameramen ganga to rambabu business
Venkatesh maheshbabu manchu vishnu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles