Ramyakrishna birthday

ramyakrishna-birthday , born on 1967 spetember 15th, krishna vamsi

ramyakrishna-birthday

13.gif

Posted: 09/15/2012 05:20 PM IST
Ramyakrishna birthday

        తెలుగు చిత్ర సీమలో రమ్యకృష్ణ అంటేనే ఓ ప్రత్యేక మైన స్థానం. అగ్రహీరోయిన్ గా వెండితెరపై మెరిసి ఇప్పటికీ తనదైన శైలిలో నటన ప్రదర్శిస్తున్న ఈ అందాల రాసి పుట్టినరోజు ఇవాళ. ఈ సందర్భంగా రమ్య విశేషాలు. 1967 సెప్టెంబరు 15 న జన్మించిన రమ్యకృష్ణ, 13 వramya_inneree ఏటనే అభినయం దిశగా అడుగులు వేసింది. 1980 ప్రధమార్ధంలో 'భలే మిత్రులు' చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన రమ్యకృష్ణని కాలం వెంటనే కనికరించలేదు. దాంతో నిరాశా నిస్పృహలతో కొనసాగుతోన్న ఆమె కెరియరుకు 'సూత్రధారులు' చిత్రం ఆశాకిరణమై నిలిచింది ... ఆమెలోని నటిని చాలా చక్కగా ఆవిష్కరించింది. ఈ సినిమాతో ఆమె ఇటు పరిశ్రమ దృష్టిని ... అటు ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఈ నేపథ్యంలో ఆమె నటించిన 'అల్లుడుగారు' చిత్రం ఆమెకి తొలి ఘన విజయాన్ని అందించింది. ఈ సినిమాలో అదరహో అనిపించే ఆమె అందం ... అభినయం చూసిన ప్రేక్షకులు, దేనికి ఎక్కువ మార్కులు వేయాలో తెలియక తికమక పడ్డారు. ఇక ఈ సినిమా నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. 'అల్లరి మొగుడు' ... 'బృందావనం' ... 'అల్లరి అల్లుడు ' ... 'అల్లరి ప్రియుడు' ... 'ముగ్గురుమోనగాల్లు' ... 'బంగారు బుల్లోడు' ... 'హలో బ్రదర్' ... 'అమ్మోరు' ... 'అన్నమయ్య' వంటి చిత్రాలతో అఖండ విజయాలను అందుకుంటూ వెళ్లింది. దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ కలిసి నటించింది. ఇక 'అమ్మోరు' చిత్రంలో ఆమె చేసిన నట విన్యాసాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. అలాగే 'నరసింహా' చిత్రంలో రజనీకాంత్ కాంబినేషన్లో ఆమె చేసిన 'నీలాంబరి' పాత్ర కూడా ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఈ సినిమాలో ఆమె రజనీకాంత్ స్టైల్ ను తన నటనతో ఎదుర్కొన్న తీరు అందరినీ ఆశ్చర్య చకితులను చేసింది. ఇలా ఆమె నట ప్రస్థానం తెలుగుతో పాటు తమిళ ... మలయాళ ... కన్నడ ... హిందీ భాషల్లోనూ కొనసాగుతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ko ante koti movie triler
Accident in gouravam shooting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles