నో బ్యారియర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రవిశంకర్ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దు కుంటున్న చిత్రం 'డబుల్ ట్రబుల్'. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఎడిటింగ్, డబ్బింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం సౌండ్ ఎఫెక్ట్స్, రీరికార్డింగ్, డిటిఎస్ ఫైనల్ మిక్సింగ్‌లో వుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పార్ట్ విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రం మూడు షెడ్యూల్స్ హైదరాబాద్, ముంబాయి, గోవా పరిసర ప్రాంతాల్లో వున్న అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించారు. ఈ సినిమా ఆడియో నెల చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు జి.రవిశంకర్ మూవీ విశేషాలు వెల్లడించారు. 'నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చాలా చక్కని సంగీతాన్ని అందించారు. ఇందులోని పాటలు మళ్ళీ మళ్ళీ వినేలావుంటాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ నెలలో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
రవిశంకర్, పృథ్వి, శివన్నారాయణ, గుండు హనుమంతరావు, రాగిణి, అనంత్, తిలక్, పావనిరెడ్డి, మైథిలి తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: హరి జాస్తి, సంగీతం: సందీప్, మాటలు: ఎస్.నందకిషోర్, రాజేష్‌సాయి, ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: వర్మ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: చంద్రారెడ్డి, కో డైరెక్టర్: బిక్షపతి, అసోసియేట్ డైరెక్టర్స్: చిన్నా ఎం, చలపతి, నిర్మాణం: నో బ్యారియర్స్ గ్రూప్, కథ- స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: రవిశంకర్.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more