Pawan kalyan and kajal pair

pawan kalyan and kajal pair in trivikram srinivas direction ,

pawan kalyan and kajal pair

17.gif

Posted: 09/07/2012 06:59 PM IST
Pawan kalyan and kajal pair

        పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అందాల భామ కాజల్ అగర్వాల్ జోడీ కట్టబోతోంది. 'జులాయి' సినిమా సమయంలోనే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాను పవన్ కళ్యాన్ తో చేయాలని నిర్ణయించుకుని ఆమేరకు ఓ ప్రకటన కూడా చేసిన సంగతి pawan_kajal_eeగుర్తుండే ఉంటుంది.  దీనికి పవన్ కూడా ఓకే చెప్పాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'జల్సా' చిత్రం ... ఇటీవల వచ్చిన 'జులాయి' చిత్రం ఈ రెండు కూడా ఘన విజయాలను సాధించాయి. ఈ రెండింటిలోను కథానాయిక ఇలియానా కావడంతో, ఈసారి కూడా ఆమెకే అవకాశం ఇవ్వాలని త్రివిక్రమ్ భావించాడు. అయితే బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఇలియానా డేట్లు సర్దుబాటు చేయలేక పోతోందట. దాంతో కాజల్ ను తీసుకుంటే బాగుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నట్టు వినికిడి.
       ఇక కాజల్ కూడా ఎన్టీఆర్ ... రామ్ చరణ్ ... మహేష్ బాబు వంటి కథానాయకుల సినిమాలతో చాలా బిజీగా ఉంది. అయినా ఆమెను సంప్రదించడానికి త్రివిక్రమ్ సిద్ధమౌతున్నాడని అంటున్నారు. కాజల్ గనుక డేట్లు సర్దుబాటు చేయగలిగితే ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఆమేనని అంటున్నారు. ఆల్రెడీ అబ్బాయి జోడీగా హిట్ కొట్టిన కాజల్, అతని బాబాయ్ సరసన చాన్స్ వస్తే వదులుకుంటుందా.. వదులుకోదుకదా... అయితే ఇక పవన్-కాజల్ జోడీ కట్టడమే తరువాయి..

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramgopal varma bhoot returns triler release
Nagarjuna damarukam audio release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles