Amitab about aaradhya

amitab about aaradhya , his grand daughter, aiswara rai, abhi, ish,

amitab about aaradhya

3.gif

Posted: 09/01/2012 03:13 PM IST
Amitab about aaradhya

       మెగా స్టార్ బిగ్ బి ఓ పలకరింపు కోసం తపించిపోతున్నాడట.. ఓ పిలుపు కోసం, ఆత్మీయ స్పర్శ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాడట.. ఎందుకనంటారా... బిగ్ బి తన మనమరాలు ఆరాధ్య గురించి తెగ కలవరిస్తున్నారు. తొమ్మిది నెలల ఆ చిన్నారి ఇప్పుడు బిగ్ బి మనసు దోచేసుకుంది. అనుక్షణం, ప్రతిక్షణం ఆ పసి దాని చుట్టూ అమితాబ్ ఊహలు అల్లుకుపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల ప్రేమ, ఆప్యాయతలను దోచుకున్న బిగ్ బి ఇప్పుడా చిన్నదాని చిలిపి చేష్టలకి, ముద్దు ముచ్చట్లకి ఫిదా అయిపోయారు. మంచి తాతయ్య అనిపించుకోవాలని తెగ ఆరాటపడిపోతున్నారు. పలకరిస్తే చాలు.. సొట్ట బుగ్గల నవ్వులు, కేరింతలే తప్ప మనుషులను ఇంకా పూర్తిగా గుర్తు పట్టలేకపోతోంది ఆరాధ్య.

amitab_inn
    బిగ్ బి ఎత్తుకోగానే ఆయన గడ్డంతో ఆడుకుంటుందట.  వుంగా వుంగాలు.. ఊకొట్టే వయసు దాటిన ఆ చిన్నారి ఏదో మాట్లాడాలని, ఏదో చెప్పాలని తెగ ట్రై చేస్తోందట. ఆరాధ్యకి అన్నీ మంచి అలవాట్లేనట.. రాత్రుళ్లు పదే పదే పక్కలు తడపడం, ఏడ్వడం లాంటి ఇబ్బందులు లేనే లేవట. కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ సిక్స్ సీరీస్ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన అమితాబ్ తన ముద్దుల మనవరాలి ముచ్చట్లను చెప్పుకొచ్చారు. ఆరాధ్య బిగ్ బి దంపతులకు ఎంతలా అలవాటయిందంటే.. క్షణమైనా ఆ బుజ్జాయిని వీడి amitab_2.11ఉండలేకపోతున్నారట. ఆబుజ్జాయిది చాలా స్మైలింగ్ ఫేస్ ట. వడవడిగా పాకుతున్న ఆ పసికూన ఎప్పుడు అడుగులేస్తుందా అని బచ్చన్ దంపతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆరాధ్య ముద్దు పేరు ఏంటో తెలుసా..? స్ట్రాబెర్రీ.. అభి, ఐష్ ఇద్దరి పోలికలు కలగలిసి కనిపించే ఆ చిన్నారి అందాన్ని మాటల్లో చెప్పలేమంటున్నారు బచ్చన్ దంపతులు..
    ముద్దుల మనవరాలి వివరాలు ఒక్కొక్కటి లీక్ చేస్తున్న బిగ్ బి కుటుంబం.. ఆరాధ్యను మీడియాకు ఎప్పుడు చూపిస్తారో మరి.. ఆరాధ్యను ఏదో పెద్ద బేబి ప్రోడక్ట్ యాడ్ తో మీడియా ముందుకు తీసుకొస్తారనే వార్తలూ వినిపిస్తున్నాయి.  అమితాబ్ ఇంతలా పరితపించిపోడానికి కారణం ఆ బుజ్జాయి ఇప్పుడు చికాగోలో వుందట.. అభిషేక్ ధూమ్ త్రి షూటింగ్ సందర్భంగా యువజంట అక్కడే వున్నారుట. మనవరాలి రాక కోసం అమితాబ్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan chit chat in radio mirchi
Amir khan greatness  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles