లేటెస్ట్ గా హిట్ సినిమాల దర్శకుల లిస్టులో చోటు సంపాదించుకున్న ‘గబ్బర్ సింగ్ ’ డైరెక్టర్ హరీశ్ శంకర్ త్వరలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ చిత్రం నిర్మంచడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి గతంలో హరీష్ శంకర్ ‘ఎమ్మెల్యే ’ టైటిల్ టైటిల్ ఖరారు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ మధ్యన దిల్ రాజు ఫిలిం ఛాంబర్ లో ‘జన గణ మన’ అనే టైటిల్ ని రిజిష్టర్ చేయించాడు. ఈ టైటిల్ పవన్ కళ్యాన్ తో తీయబోయే సినిమా కోసమని ఫిలింనగర్ లో ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఆ చిత్ర టైటిల్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహించే జూనియర్ ఎన్టీఆర్ కోసమని , ఆ టైటిల్ నే హరీశ్ శంకర్ ఫైనల్ చేశాడని వార్తలు. ఫ్యామిలీ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాత కాగా ప్రస్తుతం ఈ చిత్రం టైటిల్పై అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉన్నది.
అయితే ఈ టైటిల్ రిజిష్టర్ చేయించడానికి కారణం వీరి కాంబినేషన్ లో వచ్చే సినిమా రాజకీయ అంశాలతో కూడుకున్నదని అందుకే దీనికి ఆ టైటిల్ పెట్టినట్లు వార్తలు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ రాబోయే కాలంలో రాజకీయాల్లో దూసుకుపోయేందుకే ఇలాంటి చిత్రాన్ని తీస్తున్నారని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more