Balakrishna social service

balakrishna social service

balakrishna social service

23.gif

Posted: 08/27/2012 08:09 PM IST
Balakrishna social service

      నందమూరి నటసింహం బాలకృష్ణ తన సినిమాలకి సంబంధించి కొంతకాలంగా దూకుడు పెంచాడు. సింహా ఘనవిజయం లాగాయితూ..bala_innnee జయాపజయాలకి అతీతంగా ఆయన సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. అయితే 'శ్రీమన్నారాయణ' సినిమా తరువాత బాలకృష్ణ  ఓ ఆరునెలల పాటు బ్రేక్ తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో ఆయన తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై దృష్టి పెట్టడమే కాకుండా, 'బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్' నిర్వహణ నిమిత్తం నిధులు సేకరించనున్నారు. అందువల్ల ఆయన దాదాపు 6 నెలల తరువాతే మేకప్ వేసుకోనున్నారని తెలుస్తోంది.  సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో బాలకృష్ణ చేయనున్న 'ఆదిత్య 999' ... అలాగే 'శ్ర్రీ కృష్ణదేవరాయలు'గా ఆయన చేయనున్న మరో చిత్రం కూడా ఈ బ్రేక్ తరువాతే తెరకెక్కుతాయని అంటున్నారు. ఇప్పటికే తన వారసుడు మోక్షజ్ఞను రంగంలోకి దింపడానికి సన్నాహాలు మొదలు పెట్టిన బాలకృష్ణ , సంవత్సరంలో సగభాగం రాజకీయాలు ... ఇతర సేవా కార్యక్రమాలకి కేటాయించనున్నారని వినికిడి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ma vuri katha new movie
Sudigadu and ektha tiger movie share  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles