ఇంతకాలం హాస్య ప్రేమికులను ఊరిస్తూ వచ్చిన అల్లరి నరేష్ 'సుడిగాడు' చిత్రం రేపే విడుదలవుతోంది. ఒక్క టిక్కెట్ మీద 100 సినిమాలు చూపిస్తామంటూ సిద్దమైన ఈ చిత్ర దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు ఈ సుడిగాడు గురించి ఇలా వివరిస్తున్నారు. 'సుడిగాడు' కామెడీ సినిమా అయినా, తాను మాత్రం ఎంతో సీరియస్‌గా ఈ చిత్రాన్ని రూపొందించానని భీమినేని అంటున్నారు.
‘‘నా కెరీర్‌లో ఎక్కువగా రీమేక్‌లను చేయటం వల్ల రీమేక్ దర్శకుడన్న ఆ ట్రాక్ రికార్డ్ వచ్చింది. ఇక ఇప్పుడు దర్శకుడిగా నాకు దాదాపు మూడు నాలుగేళ్ళ గ్యాప్ వచ్చింది. మళ్ళీ నేను దర్శకుడిగా సత్తా చాటాలంటే ఇప్పటితరానికి తగ్గట్టుగా మంచి ఎంటర్‌టైనింగ్ మూవీ చెయ్యాలనుకున్నాను. అప్పుడు తమిళంలో హిట్ అయిన 'తమిజ పదం' చిత్రం కంటెంట్ బాగుందనిపించింది. అయితే ఈ సినిమా చూసిన మన తెలుగు దర్శక నిర్మాతలెందరో రీమేక్ రైట్స్ పొందాలనుకున్నారు. ఇవివి కూడా రీమేక్ చెయ్యాలనుకున్నారు. అయితే భారీ రేట్ లేదా ఇతర కారణాలవల్ల వారు వెనక్కి తగ్గటం, నేను రీమేక్ రైట్స్ ను గ్రాబ్ చేయటం జరిగింది. అయితే నేను గతంలో చేసిన రీమేక్ చిత్రాలకు 30 శాతం మార్పులు చేస్తే, ఈ చిత్రానికి మాత్రం 70 శాతం మార్పులుచేసి మన నేటివిటీకి తగ్గట్టు ఫ్రెష్‌గా స్క్రిప్ట్ సిద్ధం చేయటం జరిగింది. దీనికోసం ఒకటిన్నర సంవత్సరం హౌంవర్క్, రీసెర్చ్ చేశాను. ఇక నేను ముందునుంచి చెపుతున్నట్టుగా ఈ సినిమా ఏ ఒక్క సినిమా సెలబ్రిటీలను కించపరి చేలా ఉండదు. కేవలం సక్సెస్ అయిన వంద సినిమాలలోని సన్నివేశాల పేరడీగా మాత్రమే రూపొందించటం జరిగింది. అందుకే ఒక్క టిక్కెట్‌పై వంద సినిమాలు అన్న ఉపశీర్షికను పెట్టటం జరిగింది.
రేపు ఈ ‘సుడిగాడు’ విడుదల అనంతరం తన తదుపరి సినిమా వివరాలు చెబుతా అంటున్నారు భీమినేని.. ఆల్ ది బెస్ట్ శ్రీనివాసరావు జీ...
...AVNK
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more