Sv krishna reddy holywood movie divorce invitation

sv krishna reddy holywood movie divorce invitation

sv krishna reddy holywood movie divorce invitation

44.gif

Posted: 08/19/2012 07:26 PM IST
Sv krishna reddy holywood movie divorce invitation

   sv_e  ఒకప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేసి శహభాష్ అనిపించుకున్నారు ఎస్వీకె. వచ్చిన మొదట్లోనే కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాలు మాత్రమే తీస్తానంటూ కెరియర్ ను ప్రారంభించిన ఎస్వీ కృష్ణారెడ్డి, ఈనాటి వరకూ అదే మాటకి కట్టుబడి ఉన్నారు. 'రాజేంద్రుడు - గజేంద్రుడు' ... 'మాయలోడు'  వంటి పూర్తి వినోదాత్మక చిత్రాలతో పాటు, 'ఎగిరే పావురమా' ... 'ఆహ్వానం' వంటి ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రాలను సైతం రూపొందించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తన 19 యేళ్ళ కెరియర్ లో 38 చిత్రాలను తెరకెక్కించిన కృష్ణారెడ్డి, త్వరలో ఓ హాలీవుడ్ సినిమాతో ప్రేక్షకులనుsv_eee పలకరించనున్నారు. ఆర్.ఆర్.మూవీమేకర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా పేరు 'డైవోర్స్ ఇన్విటేషన్'. గతంలో ఇదే కాన్సెప్ట్ తో ఆయన రూపొందించిన 'ఆహ్వానం' మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో ఈ ఆంగ్ల చిత్రం ఎలాంటి ఫలితాలను ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాలో, జోనాథన్ బెన్నెట్ ... జేమీలిన్ సింగ్లార్ ... నాడియా జోర్లీన్ ... ఎలియట్ గోల్డ్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. అక్కడకూడా ఈ సినిమా విజయవంతమై తెలుగోడి ఖ్యాతి అక్కడకూడా వెలుగొందాలని కాంక్షిద్దాం..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sudigadu movie posters teaser
Gabbar singh 100days function  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles