Devudu chesina manushulu review

devudu chesina manushulu review

devudu chesina manushulu review

24.gif

Posted: 08/15/2012 05:55 PM IST
Devudu chesina manushulu review

dcm_f

సినిమా  ‘దేవుడు చేసిన మనుషులు’
విడుదల తేది : 15 ఆగష్టు 2012దర్శకుడు : పూరి జగన్నాధ్
నిర్మాతలు : బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్
సంగీతం : రఘు కుంచె
నటీనటులు : రవితేజ, ఇలియానా
ఆంధ్రవిశేష్.కాం రేటింగ్ : 2
        మాస్ మహారాజ రవితేజ ఈ స్థాయికి రావటంలో పూరీ తోడ్పాడు ఎంతోఉంది. పూరీ రవితేజతో ఇప్పటి వరకు నాలుగు సినిమాలు తీసాడు. మొదటి మూడు హిట్ సినిమాలు ఇచ్చిన వీరు నేనింతే సినిమాతో నిరాశ పరిచారు. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఐదవ సినిమా ‘దేవుడు చేసిన మనుషులు’ ఈ సినిమా ఇవాళే రాష్ట్రవ్యాప్తంగా రిలీజైంది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
స్టోరీ క్లుప్తంగా :
        ఈ సినిమా గురించి క్లుప్తంగా చెప్పాలంటే అరటి తొక్క ముందు.. వెనక కథ. ఆడియో ఫంక్షన్లో పూరి జగన్నాధ్ చెప్పినట్లు ఈ సినిమాలో చెప్పుకోవడానికి అంటూ కథేమి లేదు. అక్షయ తృతీయ రోజు అలిగిన లక్ష్మి దేవి (కోవై సరళ)ని బుజ్జగించడానికి విష్ణు మూర్తి (బ్రహ్మానందం) చెప్పిన కథతో ఈ సినిమా కథ మొదలవుతుంది. హైదరాబాదులో అనాధగా పెరిగి మధ్యవర్తిగా పనిచేసే రవితేజ (రవితేజ)కి, బ్యాంకాక్లో అనాధగా పెరిగి టాక్సీ డ్రైవరుగా పనిచేసే ఇలియానా (ఇలియానా) మధ్య ప్రేమ పుట్టించడానికి పనిలేని పాపయ్య తో అరటి ‘తొక్క’ వేయిస్తాడు విష్ణు మూర్తి. ఆ తొక్క ద్వారా రవితేజ బ్యాంకాక్ వెళతాడు. అక్కడ ఇలియానాని కలుస్తాడు. ఇద్దరు ప్రేమించుకుని కలుసుకునే సమయంలో కొట్టుకుని విడిపోతారు. తొక్క వేస్తే వారిద్దరి ప్రేమ సక్సెస్ కాలేదని ‘తొక్క’ వేయకుండా కథని మరోలా నడిపిస్తాడు. చివరికి వారిద్దరు ఎలా కలిసారు అనేది మిగతా కథ.
ఫెర్మార్మెన్స్ :
రవితేజ తీరు ఎప్పటిలాగే సాగింది. ఇలియానా జులాయిలో లాగే ఇందులోనూ సన్నగానే కనబడింది. ఆమెకు హిగ్ అంతగా సూట్ కాలేదు. నువ్వంటే చాలా ఇష్టమే, నువ్వేలే నువ్వేలే పాటల్లో కెమెరా మెన్ చాలా బాగా చూపించాడు. ప్రకాష్ రాజ్ మతిపరుపు డాన్ పాత్ర విభిన్నంగా ఉంది. బ్రహ్మానందం, కోవై సరళ పాత్రలకి పూరీ పంచ్ డైలాగులు తోడవడంతో కొంత మెరుగైన ఫలితాలు వచ్చాయి.. గోలి పాత్రలో అలీ నవ్వించే ప్రయత్నం చేసాడు. సుబ్బరాజు పాత్రలో సుబ్బరాజు, ఫిష్ వెంకట్ క్యారెక్టర్స్ మామూలుగానే సాగాయి.
మైనస్ పాయింట్స్ :
       ఈ మూవీకి పెద్ద మైనస్ పాయింట్ ఏమిటంటే.. దర్శకుడు సినిమా మీద పూర్తి స్థాయిలో ద్రుష్టి పెట్టినట్టు కనిపించదు. ఈ ఉదాసీనత స్క్రీన్ ప్లేలో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ సినిమా కాన్సెప్ట్  12 బి అనే తమిళ సినిమా గా గోచరిస్తుంది. ఫస్టాఫ్ వరకు ఎంటర్తైన్మెంట్ పర్వలేదనిపిస్తూ సాగినా సెకండాఫ్ విసుగు తెప్పించింది. మధ్యలో అలీ, లక్ష్మి దేవి సైడ్ ట్రాక్ మొదట్లో పర్వాలేదనిపించినా తర్వాత బోర్. గ్యాబ్రియేలతో చేయించిన డిస్టబ్ చేత్తున్నాడే పాట కూడా ఆకట్టుకోలేదు. రఘు కుంచె సంగీతంలో ఆకట్టుకొనే పాటలు లేకపోగా నేపధ్య సంగీతం కూడా అంతంత మాత్రమే. రవితేజ, ఇలియానా మధ్య బలమైన ప్రేమ సన్నివేశాలు లేవు. కామెడీ కూడా అంతంతమాత్రమే. క్లైమాక్స్ సన్నివేశాల్లో ప్రకాష్ రాజ్, ఇలియానా మధ్య అన్నా, చెల్లెలు సెంటిమెంట్ సీన్స్ చూడకుండానే ప్రేక్షకులు బైటికి వెల్లిపోయే అంతలా నీరసం తెప్పించాయి.
టెక్కికల్ టీం :
        శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ  ఒక్కటే ఈ సినిమాలో చెప్పుకోదగ్గది.
చివరిమాట:
      ఈ మధ్య కాలంలో హిట్స్ లేక సతమతమవుతోన్న రవితేజకు ఈ సినిమా వల్ల కూడా హిట్ దొరకలేదు. పేలవమైన కథ, కథనంతో సాగిన ‘దేవుడు చేసిన మనుషులకు’ ప్రేక్షకాదరణ దక్కాలనుకోవటం అత్యాసే అవుతుంది. 

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Puri brother in teja movie
Moksshajna debue in tollywood balakrishna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles