Vikram remuneration

vikram remuneration

vikram remuneration

22.gif

Posted: 08/07/2012 09:21 PM IST
Vikram remuneration

       ఇటీవల కాలంలో హీరోలకిచ్చే రెమ్మునరేషన్ ల విషయంలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇది తెలుగునాటేకాదు..vikram_inn తమిళ, కన్నడ సినీ పరిశ్రమలలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. పారితోషికం విషయంలో తమిళ హీరోలు తమలో తాము విపరీతంగా పోటీపడుతున్నారు. ఒకరిని చూసి మరొకరు పెంచుకుంటూపోతున్నారు. ఇప్పటి వరకు అత్యధిక పారితోషికం (15 కోట్ల పైన) తీసుకునే హీరోలలో రజనీకాంత్, కమలహాసన్, విజయ్, అజిత్ కుమార్ వున్నారు. ఇప్పుడీ జాబితాలోకి తాజాగా విక్రమ్ కూడా చేరాడు.
         శంకర్ దర్శకత్వంలో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న 'ఐ' చిత్రానికి గాను విక్రమ్ 15 కోట్లు తీసుకుంటున్నట్టు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.  తమిళంలోనే కాకుండా, తెలుగులో కూడా తనకి మంచి మార్కెట్ ఉన్నందువల్ల 15 కోట్లు ఇచ్చి తీరాల్సిందేనని విక్రమ్ పట్టుపట్టాడనీ, రెండు మూడు దఫాల చర్చల అనంతరం ఆ పారితోషికం ఇవ్వడానికి నిర్మాత అంగీకరించాడనీ అంటున్నారు. ప్రస్తుతం తాను చేస్తున్న 'తాండవం' చిత్రం షూటింగు పూర్తికాగానే ఈ 'ఐ' చిత్రం షూటింగులో విక్రమ్ జాయిన్ అవుతాడు. ఈ సినిమా మీద దక్షిణ భారత చలనచిత్ర రంగంలో భారీ అంచనాలే నెలకొంటున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Madhavan and bhavana staring prema nilayam
Satya sequel coming soon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles