Srimannarayana audio launch

srimannarayana audio launch

srimannarayana audio launch

1.gif

Posted: 08/07/2012 03:04 PM IST
Srimannarayana audio launch

       ఎంతోకాలంగా బాలయ్య అభిమానులంతా వేచి చూస్తోన్న రోజు రానేవచ్చింది. బాలయ్యబాబు సరికొత్త గా జర్నలిస్ట్ అవతారంలో వస్తోన్న శ్రీమన్నారాయణ ఆడియో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా బాలయ్య చిత్ర సీమ తీరుతెన్నుల గురించి కొన్ని ఆశక్తికరమైన srimanna_eeeవిషయాలు లేవనెత్తారు.  ఈమధ్య వస్తున్న కొన్ని తెలుగు సినిమా టైటిల్స్ పట్ల బాలకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ధోరణిని రాత్రి జరిగిన 'శ్రీమన్నారాయణ' చిత్రం ఆడియో వేడుకలో ఆయన తూర్పారబట్టారు.
         'తెలుగుతనాన్ని అపహాస్యం చేసేలా కొన్ని సినిమాలకు టైటిల్స్ పెడుతున్నారు. అలాంటి పనులు నేను చేయను. మా సినిమా శ్రీమన్నారాయణ టైటిల్ ఎంతో పవిత్రమైన టైటిల్. తెలుగుదనం ఉట్టిపడే పేరిది. ఇందులో నా పాత్ర కూడా ఇదే. తొలిసారిగా జర్నలిస్టుగా చేస్తున్నాను. ఈ పాత్రలో కొత్త బాలకృష్ణను చూస్తారు. ఇందులో నవరసాలు వున్నాయి' అన్నారు.
          ఈ వేడుకలో ఆడియో సీడీలను బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ విడుదల చేయగా, తొలి సీడీని హాస్యనటుడు సునీల్ స్వీకరించారు. థియేటర్ ట్రైలర్స్ ను దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదల చేశారు. హైదరాబాదు HICC నోవోటెల్ లో జరిగిన ఈ వేడుక ఆద్యంతం ఉల్లాసంగా జరిగింది. అభిమానుల కేరింతల నడుమ సంగీత దర్శకుడు చక్రీతో కలిసి బాలకృష్ణ వేదికపై స్టెప్స్ వేసి అలరించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bala krishna son entry into tollywood
Pawan kalyan with sampath nandi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles