Kaikala satyanarayana birthday today

kaikala satyanarayana birthday today

kaikala satyanarayana birthday today

9.gif

Posted: 07/25/2012 04:50 PM IST
Kaikala satyanarayana birthday today

       kaikala_eనవరస నటనా సార్వభౌమ బిరుదాంకితుడు కైకాల సత్యనారాయణ. ఈ రోజు ఆయన జన్మదినం. 1935 జూలై 25న కృష్ణా జిల్లాలోని కౌతరం అనే గ్రామంలో జన్మించారు. ఆయన బాల్యం విద్యాభ్యాసం అంతా గుడివాడలోనే జరిగింది. 1959 లో డి.ఎల్ నారాయణ నిర్మాతగా చంగయ్య దర్శకత్వంలో వచ్చిన ‘సిపాయి కూతురు’ అనే చిత్రం ద్వారా సత్యనారాయణ తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రం విజయం సాదించకపోయినా సత్యనారాయణకి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. నందమూరి తారక రామారావు గారికి సత్యనారాయణ చాలా సినిమాల్లో డూప్ గా చేశారు. ఆ తర్వాత ఎన్.టి.ఆర్ నటించిన ‘సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి’ చిత్రంలో రాజకుమారుడి పాత్ర పోషించారు. అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు. సుమారు 220 చిత్రాల్లో నటించిన సత్యనారాయణ నటుడిగానే కాకుండా రామ ఫిల్మ్స్ ప్రొడక్షన్ స్తాపించి నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను నిర్మించారు. 1996లో మచిలీపట్నం నుండి లోక్ సభకి పోటీ చేసి రాజకీయాల్లో కూడావిజయం సాదించారు. డెబ్బై పదుల వయస్సులో కూడా ఇప్పటికీ చిత్రాల్లో నటిస్తున్న కైకాల మరిన్ని మంచి పాత్రలు చేయాలని ఆంధ్రావిశేష్ కోరుకుంటోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Life is beautiful will be a good movie
Face book accouts for aasin  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles