Sinugadu latest movie

sinugadu latest movie

sinugadu latest movie

13.gif

Posted: 07/25/2012 04:41 PM IST
Sinugadu latest movie

     srinu_e కృష్ణుడు, సందీప్తి కాంబినేషన్‌లో వానపల్లి బాబూరావు సమర్పణలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం 'శీనుగాడు'. ఫణిరాజ్‌ దర్శకుడు. ఈ చిత్రంలో దర్శకులు సాగర్‌, రేలంగి నరసింహారావు, వి. సముద్ర కూడా నటిస్తున్నారు. అర్జున్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ట్రెయిలర్‌ ఎన్‌. శంకర్‌ విడుదలచేశారు. అనంతరం సాగర్‌ మాట్లాడుతూ..'నేను జడ్జిగా నటించాను. చాలా మంచి కథ. దర్శకుడు చాలా త్వరగా సినిమా తీశా'డని చెప్పారు. రచయిత సంజీవ్‌ మాట్లాడుతూ..పాటలు కూడా భావయుక్తంగా ప్రతి పదం అర్థమయ్యేలా ఉన్నాయన్నారు. చిత్ర దర్శకుడు ఫణిరాజ్‌ మాట్లాడుతూ...కథ చెప్పగానే దర్శకులు నటించినందుకు ఆనందంగాఉంది. అమ్మిరాజు గారి అబ్బాయి అభిరామ్‌ ఇందులో బాగా నటించాడు. అద్భుతంగా అర్జున్‌ బాణీలు ఇచ్చాడు. అందరికీ నచ్చే సినిమా అవుతుంది. అవార్డు వస్తుందనే నమ్మకముంది' అని చెప్పారు.
       కృష్ణుడు మాట్లాడుతూ..'లాయర్‌గా నటించాను. అభిరామ్‌ నటనకు బాలనటుడిగా అవార్డు వస్తుందనే నమ్మకముంది' అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ...'సమాజానికి సందేశాన్ని ఇవ్వాలని ఓ మంచి కథను ఫణిరాజ్‌ చెప్పాడు. ఇద్దరు అనాథ పిల్లలకు ఎదురైన సమస్యలను ఏవిధంగా ఎదుర్కొన్నారనేది కథాంశం. కథ నచ్చి వెంటనే చిత్రీకరణ ప్రారంభించాం. త్వరలో ఈ సినిమాను విడుదలచేయనున్నా'మని తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Face book accouts for aasin
Bangaru kodipetta movie first lookj  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles