Shekar kammula movie life is beautiful updates

shekar kammula movie life is beautiful updates

shekar kammula movie life is beautiful updates

8.gif

Posted: 07/23/2012 03:52 PM IST
Shekar kammula movie life is beautiful updates

      se_e ప్రతి దర్శకుడికి ఒక ప్రత్యేక శైలి ఉన్నట్టే శేఖర్‌ కమ్ములకీ మిగతా దర్శకులకి లేని విభిన్నమైన శైలి ఉంది. తన బలాలు ఏమిటనేది బాగా తెలిసిన శేఖర్‌ కుమ్ముల ఎప్పుడూ తన పరిధులు దాటి బయటకి రాడు. తన సినిమాల టార్గెట్‌ ఎప్పుడూ యూత్‌, అర్బన్‌ ఆడియన్స్‌ కనుక వారిని దృష్టిలో ఉంచుకుని సినిమా తీస్తాడు. అందుకే అతని చిత్రాలు టార్గెట్‌ ఆడియన్స్‌ నుంచి మన్ననలు అందుకుంటున్నాయి. ఇలా  మంచి కాఫీలాంటి సినిమాలందించే శేఖర్ కమ్ముల తాజా సినిమా ఇంట్లో నుంచే ప్రేక్షకులకు చూపించే భాగ్యాన్ని మా టీవీ అందిపుచ్చుకుంది. వివరాల్లోకి వెళితే..  లీడర్’ చిత్రం విడుదలైన చాలా గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ” లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ “. శేఖర్ నూతన నటీ నటులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను మా టివి సొంతం చేసుకుంది. అయితే ఎంత మొత్తానికి ఈ చిత్ర రైట్స్ దక్కించుకున్నారు అనే విషయం ఇంకా తెలియలేదు, శేఖర్ కమ్ముల సినిమాకి ఉన్న అంచనాలను బట్టి ఒక ఫ్యాన్సీ అమౌంట్ వెచ్చించి ఉంటారని సమాచారం. Life-is-Beautiful_Sekhar-Kammula
       మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను జూలై 27న విడుదల చేయనున్నారు. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ఆద్వర్యంలో ఒక కోటి రూపాయలతో ఒక కాలనీ సెట్ వేశారు. విజయ్ సి కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. ఒక కాలనీలోని కొన్ని జంటల మధ్య నడిచే ప్రేమకథల్ని శేఖర్‌ కమ్ముల ఇందులో చూపిస్తాడు. జీవితం ఎంత అందమైనదో, దానిని ఎలా జీవించాలో కమ్ముల ఈ చిత్రంలో చెబుతున్నాడు. ఈ మూవీ 'హ్యాపీడేస్‌' కంటే పెద్ద హిట్‌ అవుతుందని చెబుతున్నారు. ఓవర్సీస్‌ మార్కెట్‌ మన సినిమాలకి బ్రహ్మాండంగా పెరిగిన నేపథ్యంలో అక్కడ సూపర్‌ ఫాలోయింగ్‌ ఉన్న శేఖర్‌కమ్ముల ఈ చిత్రంతో రికార్డులు సృష్టిస్తాడని ఆశిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Real star srihari in shiridi sai
Jagapathi babu and bhoomika staring new movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles