Civil case on director ramgopal varma

civil case on director ramgopal varma

civil case on director ramgopal varma

15.gif

Posted: 07/17/2012 06:53 PM IST
Civil case on director ramgopal varma

    ram_ilaya  తన సినిమాలతోనే కాదు, మాటలతో సైతం సన్షేషన్ క్రియేట్ చేసే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వర్మ ఇటీవల తెరకెక్కించిన డిపార్ట్ మెంట్ ఓపక్క అట్టర్ ప్లాప్ అయ్యి తల వాచిపోతే ఈ సినిమా తాలూకూ కష్టాలు మరోపక్క ఇంకా వర్మను వీడటంలేదు. ఆమధ్య బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అతని సంస్థ సిఇఒ వర్మతో పనిచేయటమంత బుద్ధితక్కువ పని మరోటి లేదని చిచ్చు రగిల్చితే ఇప్పుడు ఇచ్చిన మాట తప్పినందుకు ఇళయరాజాకు కోపమొచ్చింది. అందుకే, ఇప్పుడు రాంగోపాల్ వర్మ మీద కోర్టుకెక్కాడు. ఇటీవల వర్మ తీసిన 'డిపార్ట్ మెంట్' హిందీ చిత్రంలో ఇళయరాజా పాట ఒకటి వాడుకున్నారు. గతంలో రజనీకాంత్ నటించిన 'అడితా వారిసు' చిత్రంలోని 'ఆసారి నూరు వాగై...' అంటూ సాగే ఈ పాట అప్పట్లో ఎంతో పాప్యులర్ అయింది. ఈ పాట ట్యూన్ ను తమ 'డిపార్ట్ మెంట్' ra_fచిత్రంలో వాడుకుంటామని, నిర్మాతలు ఇళయరాజా అనుమతి కోరగా, 30 సెకండ్లు మాత్రమే వాడుకోవాలని చెబుతూ, ఆయన పర్మిషన్ ఇచ్చారు. అయితే, తీరా చూస్తే ... ఆ సినిమాలో మొత్తం పాట పాటంతా వాడేసుకోవడంతో ఇళయరాజాకు కోపం వచ్చి, మద్రాస్ హైకోర్టులో కేసు వేశాడు. ఆ పాటను నిషేధించాల్సిందిగా కోర్టును కోరాడు. దీంతో, తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఆ పాటను సినిమాలో ఉపయోగించవద్దంటూ కోర్టు స్టే విధించింది. మరి ఈ వివాదం ఎలా సద్దుమణుగుతుందో...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director prabhudeva now on twitter
Balayyababu latest movie news  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles