Tanikella bharani birthday story

tanikella bharani birthday story

tanikella bharani birthday story

23.gif

Posted: 07/15/2012 01:51 PM IST
Tanikella bharani birthday story

      bha_eఆయన హాస్యపాత్ర పోషిస్తే నవ్వని వాళ్ళుండరు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ డమ్ సంపాదించుకున్న విలక్షణమైన నటుడు. తండ్రిగానో, బాబాయ్ గానో చేస్తే హుందాగా ఒదిగిపోతారు. ఆయనే తనికెళ్ల భరణి. నాటక రచయితగా, కవిగా, నటుడిగా రెండు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్న తనికెళ్ల భరణి పుట్టినరోజు ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన వారేకాదు అనేక మంది అభిమానులు ఆయన ఇంటికివెళ్లి పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందడి రాత్రి వరకూ కొనసాగింది. భరణి బర్త్ డే పురస్కరించుకుని  ఆంధ్రావిశేష్.కాం అందిస్తోన్న ప్రత్యేక కథనం..
      తనికెళ్ళ భరణి జులై 14, 1956లో పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. తెలుగు సినిమాలలో హాస్య ప్రధాన పాత్రలతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు.  సీతతో అదంత వీజీ కాదు అంటూ నచ్చిన bharani_tanikelaఅమ్మాయిని ఎలా ప్రేమలో పడేయాలా అని ప్రయత్నాలు చేస్తూ పక్కవాళ్ళ సలహాలు విని భంగపడే అమాయకపు దొరబాబు గా, చివరికి తన మామ దుర్భుద్ది తెలిసి అతనికి గడ్డిపెట్టే పాత్రలో కనకమాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ సినిమాలో ఆకట్టుకున్నారు. చెట్టుకింద ప్లీడర్ సినిమాలో రాజేంద్రప్రసాద్ గుక్కతిప్పుకోకుండా తనకారు గొప్పతనం గురించి పేజీలు పేజీలు డైలాగులు చెప్తుంటే వాటన్నింటికీ  జవాబుగా పాత సామాన్లు కొంటాం అని ఒకే ఒక్క డైలాగ్ తో ప్రేక్షకుల్ని థియేటర్లలో కూర్చోనివ్వకుండా నవ్వించిన ఘనత ఆయనది. శివ సినిమా లో నానాజీ గా వైవిధ్యమైన గెటప్ తో మెప్పించిన భరణి చక్కని డైలాగ్ డెలివరీతో కామెడీ ఆర్టిస్ట్  గా కూడా మంచి నటుడు అని పేరు తెచ్చుకున్నారు.
        నాకో బుల్లి చెల్లి.. నేడే గల్లీలో దానికి పెళ్ళి. ఇది జరగాలి మళ్ళీ మళ్ళీ అంటూ తోటరాముడుగా లొల్లి చేసినా, వారెవా ఏమి ఫేసు అంటూ మాణిక్యంగా ఖాన్ దాదాని మాటల్తో మాయచేసినా, ఇంద్రన్న నమ్మిన బంటు వాల్మీకి గా అందరినీ మెప్పించినా, భార్యని అమితంగా ప్రేమిస్తూ ఏనాటికైనా అసెంబ్లీ లో కొర మీనంత మైకట్టుకొని అద్దెచ్చా అనాలనుందంటూ చేపలకృష్ణగా అదరగొట్టినా ఆయంనకే చెల్లింది. ఇలా తలుచుకుంటుంటే ఈ జాబితాకు అంతే ఉండదు. ఆయా పాత్రల్లో లీనమయ్యేలా చేయడం తనికెళ్ల భరణికి కళపై ఉన్న ప్రేమకు నిదర్శనం. అందుకే  ఆయన కళా భరణి.
       తనికెళ్ల భరణి మంచి రచయిత, ఎన్నో కవితలు, మరెన్నో హాస్య భరిత పాత్రలు ఆయన సొంతం. ఇప్పటిదాకా 500కు పైగా సినిమాల్లో నటించారు. తన నటనతో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న తనకెళ్ళ భరణీకి మరిన్ని గుర్తుండిపోయే పాత్రలు చేయాలని ఆంధ్రావిశేష్.కాం ఆకాంక్ష.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  James bond meterial exhibition
Sherlyn chopra posts her naked pictures on twitter  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles