A family film with manchu family soon

a family film with manchu family soon

a family film with manchu family soon

17.gif

Posted: 07/13/2012 08:06 PM IST
A family film with manchu family soon

ookodatara

  'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' చిత్రం విడుదల తేదీని ఖరారు చేసుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాని ఆగస్టు 2 వ తేదీన విడుదల చేయనున్నట్టు నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న ప్రకటించారు. రాఖీ పండుగ కానుకగా ఈ కుటుంబ కథా చిత్రాన్ని అందిస్తున్నట్టు ఆమె చెప్పారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, తమ బ్యానర్లో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాల్లో ఈ సినిమాకి మొదటి స్థానం దక్కుతుందని అన్నారు. ఈ సినిమా కోసం లక్ష్మీ ప్రసన్న విపరీతంగా ఖర్చు చేస్తూ తన ధైర్యానికి  పరీక్ష పెట్టిందని చెప్పారు. ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర కూడా అందరి మెప్పు పొందుతుందని అన్నారు. ఇక బాలకృష్ణ - మనోజ్ ల పాత్రలను దర్శకుడు శేఖర్ రాజా అద్భుతంగా తీర్చిదిద్దాడనీ ... ఈ సినిమా ఘన విజయాన్ని సాధించి చరిత్ర సృష్టిస్తుందనే నమ్మకం తనకి ఉందని చెప్పారు. ఇదిలా ఉంటే, తమ కుటుంబంలోని కథానాయకులతో కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచన అక్కినేని ఫ్యామిలీకి, రామానాయుడు ఫ్యామిలీకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు కూడా రంగంలోకి దిగినట్టుగా కనిపిస్తోంది. మంచు విష్ణు ... మనోజ్ ... లక్షీ ప్రసన్న ఈ ముగ్గురితో కలిసి నటించేందుకు మోహన్ బాబు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కథా చర్చలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. అయితే ఇటీవల వచ్చిన 'బోల్ బచ్చన్' అనే హిందీ చిత్రం మోహన్ బాబు కి తెగ నచ్చేయడంతో, ఎలాగైనా ఆ సినిమాని తెలుగులోకి రీమేక్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trisha in saamy remake in bollywood
Mehar ramesh and venkatesh movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles