Svsc shooting now in ahobilam forest

svsc shooting now in ahobilam forest

svsc shooting now in ahobilam forest

10.gif

Posted: 07/05/2012 03:58 PM IST
Svsc shooting now in ahobilam forest

      మల్టీ స్టారర్ మూవీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' షూటింగ్ లో కొద్దిసేపటిక్రితం అపశృతి చోటుచేసుకుంది. కర్పూలు జిల్లా అహోబిలంలో జరుగుతున్న షూటింగ్ కార్యక్రమంలో పెళ్లి పందిరి సెట్టింగ్ కూలింది. ఈ దుర్ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన జరిగిన సమయంలో లంచ్ బ్రేక్ కావడంతో ప్రధాన తారలకు పెద్ద ప్రమాదం తప్పింది. అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రమాదం చిన్నదే నని చిత్ర వర్గాల నుంచి అందిన సమాచారం. 5eeee
     కాగా,  విక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్ బాబు ప్రధాన పాత్రలలో నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు". కుటుంభసమేతంగా ఎప్పుడు చూద్దామా అని వేచి చూస్తోన్న ఈ మూవీ లో చాలా రోజుల తరువాత ఇద్దరు ప్రధాన తారలు ఒక చిత్రం కోసం కలిసి పని చేస్తున్నారు ఈ రోజు నుంచి ఈ చిత్రం షూటింగ్ అహోబిలం అటవీ ప్రాంతంలో ఈ ఉదయం మొదలైంది. సెట్ కూలిపోవటానికి ముందు వెంకటేష్-అంజలిలపై ఇక్కడ పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మరో నాలుగు రోజుల పాటు ఇక్కడే చిత్రీకరణ జరుగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ అపస్రుతి నెలకొంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం స్టోరీ లైన్ పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ తో కూడుకున్నది.  అన్నదమ్ముల రిలేషన్ ఈ చిత్రంలో మెయిన్‌గా ఫోకస్ కానుంది. ఒక రకంగా చెప్పాలంటే రామాయణంలో రాముడు, లక్ష్మణుల పాత్రల్లా ఉంటాయి వెంకటేష్ మహేష్ బాబు పాత్రలు.
     విజయపథాన నడుస్తోన్న శ్రీకాంత్ అడ్డాల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, సమంత , అంజలి లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిక్కి జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రాన్ని దసరా పండుగలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bollywood actress katrina kaif gets award
Writer chinni krishna case details  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles