Sobhan babu jayanthi celebrated

sobhan babu jayanthi celebrated

sobhan babu jayanthi celebrated

39.gif

Posted: 07/01/2012 08:25 PM IST
Sobhan babu jayanthi celebrated

       తెలుగుతెర 'సోగ్గాడు'గా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన ప్రముఖ నటుడు శోభన్ బాబు జన్మదిన వజ్రోత్సవాలను హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. మాదాపూర్లోని శిల్పకళావేదిక ప్రాంగణంలో శోభన్ బాబు అభిమానులు 'ఆంద్ర ప్రదేశ్ శోభన్ బాబు సేవాసమితి' పేరిట నిర్వహించిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేశారు. గొప్పనటుడైన శోభన్ బాబుతో తనకు పరిచయం లేకపోయినా, ఆయన మీద వున్న అభిమానంతో, ఓ అభిమానిగా ఈ వేడుకకు వచ్చానని ముఖ్యమంత్రి అన్నారు. వేదికపై ఏర్పాటు చేసిన శోభన్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దర్శకుడు దాసరి నారాయణ రావు 5eeeమాట్లాడుతూ, శోభన్ బాబు ఒక ప్రత్యేకమైన నటుడనీ, దిలీప్ కుమార్ తర్వాత మళ్లీ ఆరుసార్లు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్న ఘనత ఆయనదనీ అన్నారు. అలాగే, ఒకే ఏడాదిలో 8 శత దినోత్సవ చిత్రాలు చేసిన క్రెడిట్ శోభన్ బాబుదని దాసరి చెప్పారు. హీరో కృష్ణ చెబుతూ, శోభన్ బాబుతో తన పరిచయం రైలు ప్రయాణంలో జరిగిందని అన్నారు. తాను తేనెమనసులు చిత్రంలో సెలెక్ట్ అయిన వెంటనే ముందుగా ఆ విషయం ఆయనకే చెప్పానని అన్నారు. ఆయనతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందనీ, తామిద్దరం కలిసి నటించిన సినిమాలన్నీ హిట్టయ్యాయని కృష్ణ చెప్పారు.
      మరో ప్రముఖ నటుడు కృష్ణం రాజు చెబుతూ, తనకు శోభన్ తో ఎంతో అనుబంధం ఉందనీ, గుప్త దానాలెన్నో చేసిన గొప్ప మనసున్న మనిషి శోభన్ బాబు అనీ అన్నారు. శోభన్ తో పలు చిత్రాలలో కథానాయికగా నటించిన వాణిశ్రీ చెబుతూ, "అందరితోనూ ఆయన మంచిగా వుండేవారు. ఆయన కోప్పడడం గానీ, విసుక్కోవడం కానీ నేనెప్పుడూ చూడలేదు. నేను 'బన్ బాబు' అంటూ పిలుస్తూ ఆయనను ఆటపట్టించేదాన్ని. మితభాషి అయినా స్నేహభావం ఎక్కువ. మా మనసులకు దగ్గరగా వుండే హీరో ఆయన' అన్నారు. శోభన్ తో 31 సినిమాలు చేశాననీ, ఆయనతో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయనీ మరో నటి జయసుధ అన్నారు. జయచిత్ర చెబుతూ, ఆంధ్రా అందగాడు, సోగ్గాడు అయిన శోభన్ బాబు కళ్ళతోనే ఆకట్టుకునే వారనీ, ఆయనతో సోగ్గాడు తనకు తొలి చిత్రమనీ, ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేశాననీ అన్నారు. ఇంకా పలువురు ప్రముఖులు శోభన్ తో తమకున్న అనుబంధాన్ని వివరించారు.
      ఈ సందర్భంగా 75 మంది పేద కళాకారులకు నిర్వాహకులు ఆర్ధిక సాయం అందజేశారు. శోభన్ బాబు తనయుడు కరుణ శేషు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Was tv9 deal with tv9
Telugu film industry bandh post phone  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles