Akkineni nagarjuna and nayana tara new movie love story

akkineni nagarjuna and nayana tara new movie love story

akkineni nagarjuna and nayana tara new movie love story

5.gif

Posted: 06/25/2012 01:51 PM IST
Akkineni nagarjuna and nayana tara new movie love story

3.13rమొన్నటి వరకూ మెరిసిన జుత్తు, గెడ్డంతో కనిపించి, చరణ్ వెడ్డింగ్ లో సరికొత్త గెటప్ లో అలరించిన నాగ్ లవ్ స్టోరీ కోసం ఆ గెటప్ వేశారని అప్పట్లో వివరించాం. ఇటీవలే.. 'శిరిడీ సాయి', 'డమరుకం' చిత్రాలను పూర్తి చేసిన అక్కినేని నాగార్జున, ప్రస్తుతం 'లవ్ స్టోరీ' చిత్రం షూటింగులో పాల్గొంటున్నారు. గతంలో నాగార్జునతో 'సంతోషం' చిత్రాన్ని డైరెక్ట్ చేసిన దశరథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. హైదరాబాదు హైటెక్ సిటీ ప్రాంగణంలో ఈ చిత్రం కోసం తాజాగా నాగార్జున, భారత్ రెడ్డి, మీరాచోప్రా పాల్గొన్న సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించారు. త్వరలో కథానాయిక నయనతార కూడా ఈ షూటింగులో జాయిన్ 3eeఅవుతుందని తెలుస్తోంది.  ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఇందులో నాగార్జున వైవిద్యంతో కూడిన పాత్రను పోషిస్తున్నారనీ, నేటి యువత స్టయిల్ కి అనుగుణంగా ఆయన గెటప్ ఉంటుందనీ అన్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం షూటింగు ఎక్కువ భాగం అమెరికాలో చేయబోతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో అక్కినేని అందగాడు నవయువకునిగా ప్రేమను పండించుకోబోతున్నాడని సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  An incident of legend actor sv rangarao
Cinimaa awards 2012 curtain raiser  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles