Do u want dinner with balakrishna

do u want dinner with balakrishna ?

do u want dinner with balakrishna ?

13.gif

Posted: 06/20/2012 05:07 PM IST
Do u want dinner with balakrishna

     5eవ్యక్తిగతంగా బాలయ్య చాలా మంచి వ్యక్తని అందరూ అంటుంటారు.  ఓ వైపున వరుస సినిమాలతో, అప్పుడప్పుడూ రాజకీయాలతో ఎప్పుడూ ఎంతో బిజీగా ఉండే బాలకృష్ణ, సామాజిక సేవల విషయంలోనూ ముందే వుంటారు. గతంలో ఎన్నో సార్లు ఈ విషయాన్ని రుజువు చేసిన బాలకృష్ణ, మరోసారి అలాంటి సేవా కార్యక్రమానికి నడుం బిగించారు. హైదరాబాద్ లోని 'బసవ తారకం కేన్సర్ హాస్పిటల్' కి బాలకృష్ణ  చైర్మెన్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఎన్నో వేల మంది పేషంట్ల కి ఆరోగ్యశ్రీ వసతినీ ... మరెన్నో వేల మంది పేద పేషంట్లకి విలువైన రాయితీలను ఈ హాస్పిటల్ కల్పించింది. మరింత ఆధునీకమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ హాస్పిటల్ నిర్వహణకి 5eeఅవసరమైన ఫండ్స్  కోసం అమెరికాలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ హాస్పిటల్ కి విరాళ మిచ్చిన వారికి బాలకృష్ణతో కలిస్ డిన్నర్ చేసే అవకాశాన్ని కల్పించారు. ఒకరికైతే 100 డాలర్లు ... ఫ్యామిలీకైతే 150 డాలర్లు ఇందుకోసం చెల్లించవలసి ఉంటుందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ముద్రించిన బ్రోచర్ ని విడుదల చేశారు. విరాళాలు ఇచ్చిన వారితో బాలకృష్ణ డిన్నర్ కార్యక్రమం జూలై 4 వ తేదీన అమెరికాలో ఏర్పాటు చేశారు.
      సమాజానికి మేలు చేయాలనుకునే తలంపు బాలయ్య మానవత్వానికి అద్దంపడుతుంది కదా... ఇలానే మన తారలంతా వారి వారి పరిధిలో పూనుకుంటే సమాజానికి మరింత మేలు కలుగుతుంది.. ఏమంటారు... 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan upasana europe tour
Mohan babu villan role  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles