Malayalam actor dilip as a siababa

malayalam actor dilip as a siababa

malayalam actor dilip as a siababa

5.gif

Posted: 06/18/2012 12:46 PM IST
Malayalam actor dilip as a siababa

      పుట్టపర్తిసాయిబాబా మహిమలతో సౌభాగ్యచిత్ర సంస్థ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈచిత్రంలో బాబా పాత్రధారి ఎవరా? అంటూ రకరకాలుగా చర్చలు జరిగాయి. మోహన్‌లాల్‌అనీ, సురేష్‌గోపీ అంటూ వార్తలు వచ్చాయి.2e ఆఖరికి మలయాలనటుడు దిలీప్‌కు దక్కింది. చిత్రమే మంటే... ఆయన్ను ఈపాత్రవేయడానికి కోడిరామకృష్ణ పోన్‌చేస్తే.....ఇప్పుడే తాను సాయిబాబా గురించి తలచుకుంటున్నాననీ, వెంటనే మీ పోన్‌రావడం చాలాథ్రిల్‌గా వుందనీ. ఇదంతా బాబా కృపనేనంటూ పేర్కొన్నారని- కోడి రమాకృష్ణ చెప్పారు. కరాటం రాంబాబు నిర్మిస్తున్న ఈచిత్రానికి కోడిరామకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికి రెండుషెడ్యూల్స్‌ పూర్తిచేసుకుంది.
      చిత్రంగురించి కోడిరామకృష్ణ మాట్లాడుతూ నేను దర్శకత్వం వహించిన 'దేవుళ్ళు' చిత్రనిర్మాతల్లో కరాటం రాంబాబు ఒకరు. సాయినాదునిపై చిత్రం నిర్మించడానికి ఆయన ముందుకురావడం హర్షదాయకం.2ee బాబా గురించి పుస్తకాల్లో ప్రచురితమైన మహిమల గురించి ఈ సినిమాలో చెప్పడంలేదు. ఆయన భక్తులను స్వయంగా కలుసుకుని వాటి సమాహారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. 8, 10, 14, 35, 50, 85 ఏళ్ళ బాబా పాత్రధారులను చూపిస్తున్నాం. బాబా పాత్రదారి కోసం ఎంతోమందిని వెతికాం. కొన్ని కారణాలవల్ల కొందరు పనిచేయలేక పోయారు. మా అందరిమనసుల్లోమెదిలిన ఓ నటుడికి పోన్‌చేశాం. ఆయన వెంటనే చేయడానికి అంగీకరించారు. ఆయనే మలయాళ నటుడు దిలీప్‌. ఈచిత్రంలో పాటలకు ఇళయారాజా కొండంత బలం ఇస్తున్నారు. 14 పాటలున్నాయి. అన్నీ కథాగమనానికి సహకరించేవే' అన్నారు.
      నిర్మాత కరాటం రాంబాబు మాట్లాడుతూ తొలి షెడ్యూల్‌ పుట్టపర్తిలో తెరకెక్కించాం. రెండోషెడ్యూల్‌ పశ్చిమ గోదావరిలో చిత్రీకరించాం.2eee స్థానిక బుట్టాయిగూడెంలో వేసిన బాబాసెట్‌ ఆకట్టుకుంటుంది. బ్రిటీష్‌ కాలానికి సంబంధించిన పరిసరాలను ప్రతిఫలించేలా సన్నివేశాలు అక్కడతీస్తున్నాం. దీంతో 40శాతం పూర్తవుతుంది. ఈపాత్రను మలయాళ హీరో శ్రీజిత్‌ నటించారు. బాబా తల్లిగా జయప్రద, తండ్రిగా శరత్‌బాబు, తాతగా కెవి రమణాచారి పోషిస్తున్నారు. బాబా పాత్రకు విదేవీనిపుణులు మేకప్‌ వేస్తున్నారు. అదేవిధంగా బాబాకుసంబంధించిన ప్రశాంతి నిలయం సెట్‌ను కోటి రూపాయలతో హైదరాబాద్‌లో వేస్తున్నాం. త్వరలో ఆవివరాలు తెలియజేస్తాం' అని వెల్లడించారు. 
     ఈ చిత్రానికి కెమెరా: వాసు, రచన: రాజేంద్రకుమార్‌, సాహిత్యం: జొన్నవిత్తుల.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan and upasan visit arakonda village
Dookudu movie gain eight maatv awards  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles