బాలీవుడ్ అందాల భామ విద్యాబాలన్ అంటేనే విభిన్నమైన చిత్రాలు ... విశిష్టమైన పాత్రలు అని చెప్పవచ్చు. 'ది డర్టీ పిక్చర్' ... 'కహానీ' చిత్రాలు ఇదే విషయాన్ని మరో సారి నిరూపించాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆమె 'షాదీకీ సైడ్ ఎఫ్ఫెక్ట్స్' అనే మరో విభిన్నమైన చిత్రంలో నటించనున్నట్టు తెలుస్తోంది. గతంలో వచ్చిన 'ప్యార్ కీ సైడ్ ఎఫ్ఫెక్ట్స్' చిత్రానికి ఈ సినిమా సీక్వెల్ గా వస్తోంది. పెళ్లి తరువాత జీవితంలో చోటుచేసుకునే పరిస్థితులను ఈ సినిమాలో వినోదాత్మకంగా ఆవిష్కరించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఢిల్లీ గాళ్ గా విద్యాబాలన్, బోంబే బాయ్ గా ఫరాన్ అక్తర్ కనిపించనున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్నఈ సినిమాని, సాకేత్ చౌదరి దర్శకత్వంలో ప్రీతీష్ నంది నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా, గత కొంతకాలంగా బాలీవుడ్ లో సన్నీ లియోన్ పేరు మారుమోగిపోతోంది. పోర్న్ సినిమాలలో నటించి పేరు తెచ్చుకున్న ఈ అమెరికన్ సెక్సీ బ్యూటీ తొలిసారిగా 'జిస్మ్' సీక్వెల్ లో నటిస్తోంది. ఇప్పుడీ అందాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా త్వరలో వీక్షించనున్నారు. పూజా భట్ దర్శకత్వంలో రూపొందుతున్న 'జిస్మ్ -2' చిత్రాన్ని దక్షిణాది భాషల్లోకి డబ్ చేస్తున్నారు. ఆ విధంగా తెలుగులోకి కూడా ఈ సినిమా వస్తోంది. వచ్చే నెల 27 న ఈ చిత్రాన్ని అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మన హీరోలు కొంతమంది ఈ సెక్సీతార సన్నీ లియోన్ మీద మనసు పారేసుకున్నారు. తమ సినిమాలలో స్పెషల్ సాంగులు చేయించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.
..avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more