Brahmanandam jaffa first look super

brahmanandam jaffa first look super

brahmanandam jaffa first look super

1.10.gif

Posted: 06/13/2012 07:38 PM IST
Brahmanandam jaffa first look super

      మర్డర్..కిడ్నాప్..రేప్ ఏమీలేవు ఐనా మోస్ట్ వాంటెడ్ ... ఎవరీ కరుడుగట్టిన తీవ్రవాది అనుకుంటున్నారా.. ఎవరోకాదు..9e మన బ్రహ్మీనే.. ఖాన్ దాదాగా కలెక్షన్ల సునామీ సృష్టించిన హాస్యనటుడు బ్రహ్మానందం ప్రధాన పాత్రధారిగా 'జఫ్ఫా' చిత్రం తెరకెక్కుతోన్న సంగతి విదితమే. వెన్నెల కిషోర్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. షూటింగ్ చివరి దశకి చేరుకున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ఇప్పుడీ ట్రైలర్ కి అనూహ్యమైన స్పందన లభిస్తున్నట్టు తెలుస్తోంది.
      ట్రైలర్స్ లో సంకెళ్ళలో వున్న బ్రహ్మానందాన్ని ఓ పోలీస్ ఆఫీసర్ ఇంటరాగేట్ చేస్తుండటం ... ఆ సమయంలో బ్రహ్మానందం నిర్లక్ష్యంగా ఉండటం ... సహనం నశించిన పోలీస్ ఆఫీసర్ అతన్ని 'జఫ్ఫా' అంటూ అరవడం ... అప్పుడు బ్రహ్మానందం తన పేరు అదేనని కూల్ గా చెప్పడం ... ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. అంతే కాదు 'జఫ్ఫా' మర్డర్ ... కిడ్నాప్ ... రేప్ ఇవేవి చేయలేదు. అయినా అతను మోస్ట్ వాంటెడ్ అనే కార్డ్ కూడా ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. ట్రైలర్ లోనే కావాల్సినంత కామెడీని వర్కౌట్ చేయగలిగారు. కచ్చితంగా ఈ ట్రైలర్ హాస్య ప్రియుల అంచనాలు పెంచేదిగా  ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో బ్రహ్మానందం టెర్రరిస్ట్ గా ... అమాయకుడిగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan upasan wedding part 1
Gabbar singh theators increase  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles