ఎక్కువశాతం పాలిటిక్స్ మీద యంగ్ టైగర్ నజర్ ఉన్నట్టు అనిపిస్తోంది. ఎన్టీఆర్ కూడా తన పంథా మార్చుకుని సినిమాల్లో పొలిటికల్ సెటైర్లకు సిద్ధమంటున్నాడు. ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందనున్న 'ఎంఎల్ఎ' అనే చిత్రంలో పవర్ ఫుల్ పోలిటికల్ సెటర్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. 'ఎంఎల్ఎ' అంటే మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అని చెబుతున్నారు. గతంలో యాక్షన్ సినిమాలు చేసి ఆ తర్వాత కామెడీ, క్లాస్ సినిమాలు చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు పొలిటికల్ సెటైర్ కి వెళ్ళడం హాట్ టాపిక్ గా మారుతోంది. అలాగే పెద్ద ఎన్టీఆర్ ని గాడ్ ఫాదర్ గా చెప్పే రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో జూనియర్ కి తండ్రిగా చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కథా చర్చలు జరుపుకుంటున్న ఈ సినిమా మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుందని అంటున్నారు. గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని సైతం పెద్ద హిట్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇంతకుముందరి యంగ్ టైగర్ మూవీ దమ్ము లోనూ పొలిటికల్ డైలాగ్స్ అందరిలోనూ ఆశక్తిని ఆశ్యర్యాన్ని రేకెత్తించాయి. కొందరైతే దమ్ము సినిమా టైటిల్ రూలర్ అని పెట్టేస్తే పోయేదంటూ విశ్లేషణలు కూడా చేశారు. మళ్లీ ఇదే రీతిలో ఎన్టీఆర్ ముందుకొస్తున్నాడంటే.. చాలా అనుమానాలే రేగుతున్నాయి మరి.
..avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more