Raasi on television show

Raasi on television show.gif

Posted: 06/09/2012 06:34 PM IST
Raasi on television show

Rashi

పెద్ద పెద్ద హీరోల మధ్య చిన్న పిల్లగా , అదేహీరోల పక్కన హీరోయిన్ గా నటించిన అచ్చతెలుగు అమ్మాయి రాశి, సినీరంగానికి పూర్తిగా దూరమవ్వడమే కాక, అసలు ఆ ఫీల్డుకే పనికిరాని విధంగా తయారైన సంగతి తెలిసిందే. హీరోయిన్ గా ఆరంగేట్రం చేసిన 'శుభాకాంక్షలు' సినిమాలో ఈ మధ్యన పర్సనాలిటీకి ఏ మాత్రం పోలికలేనట్టుగా తయారైంది రాశి. సినిమాల్లో లేడీ విలన్ పాత్రలకుపనికొస్తుందేమో అనిపించేలా తయారైన రాశికి జీ తెలుగు వాళ్లు పునరావాసం కల్సిస్తున్నారు.

జీ తెలుగులో ప్రసారం అవుతున్న 'లక్కు కిక్కు' షోకు రాశి హోస్టుగా వ్యవహరిస్తూ, తెలుగు ప్రేక్షకులను పలకరిస్తోంది. చాలా రోజుల క్రితమే వివాహం చేసుకొని ప్రేక్షకులకు దూరంఅయిన రాశి తిరిగి ఇలా దగ్గరైంది. పవన్ కళ్యాన్, బాలకృష్ణ, జగపతి బాబు వంటి హీరోల పక్కన నటించినా హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయిన రాశి టీవీ హోస్టుగా ఏ మాత్రంరాణిస్తుందో చూడాలి. గతంలో ఒక షో ప్రాంరభించి అర్ధాంతరంగా రాశి అందులోంచి తప్పుకొంది, ఈ లక్కు కిక్కు ఈ మధ్య వరకూ ఝాన్సీ చేతిలో ఉండేది. అయితే ఏమైందో కానీ ఝాన్సీ స్థానంలో రాశి వచ్చిచేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shilpa infant son named viaan
Veena malik support to homosexuality  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles