Bumper offers for samantha

bumper offers for samantha

bumper offers for samantha

13.gif

Posted: 06/07/2012 05:19 PM IST
Bumper offers for samantha

      హీరోలు, దర్శకులు అంతా ఇప్పుడు సమంతానే కోరుకుంటున్నారు. ఇదే జాబితాలో ఇప్పుడు హీరో కార్తీకూడా చేరిపోయారు.saeee ప్రస్తుతం తెలుగు... అటు తమిళ భాషల్లో యమ బిజీగా వున్న సమంతాకు మరిన్ని  ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడిపోతున్నాయి. తమిళ హీరో కార్తీ కూడా ఈ సుకుమారితో ఓ సినిమా చేయాలని తెగ ముచ్చటపడిపోతున్నాడట. తాజాగా తాను వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేయనున్న 'బిర్యానీ' సినిమాలో సమంతాను బుక్ చేయమని పురమాయించాడని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.
      దాంతో నిర్మాత ఆమెను సంప్రదించి, పారితోషికం కాస్త ఎక్కువైనా ఫర్వాలేదని చెప్పాడట. అయితే, ఇప్పటికే డేట్స్ సద్దుబాటు చేయలేక సతమతమవుతున్న సమంతా, 'సారీ' చెప్పిందని అంటున్నారు. అయినా సరే, నిర్మాత మాత్రం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడట. అంతేకాదు, కొందరు 'డేట్స్ లేవు మొర్రో' అన్నా ఎవరూ వినిపించుకోవడం లేదట. ఇప్పటికే ఈ చెన్నయ్ సోయగం తెలుగులో ఆరు... తమిళంలో రెండు సినిమాలు కమిట్ అయింది. ఇవన్నీ కూడా ఇంకా నిర్మాణ దశలోనే వున్నాయి. ఇవి ఎప్పటికి కంప్లీట్ అవుతాయో కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అయినప్పటికీ 'నువ్వే కావాలి' అంటూ నిర్మాతలు ఆమె వెంట పడటం చూస్తుంటే సమంతా రేంజ్ బాగా పెరిగిపోయిందనిపిస్తోంది కదూ..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lakshmi rai abt adhinayakudu
Director harish shankar clarification  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles