Movie moghal d ramanaidu birthday special story

movie moghal d ramanaidu birthday special story

movie moghal d ramanaidu birthday special story

1.gif

Posted: 06/06/2012 01:26 PM IST
Movie moghal d ramanaidu birthday special story

      ఆయన శతాధిక చిత్రాలను నిర్మించి, ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాత. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన మూవీ మోఘల్. అంతటితో ఆగకుండా నేటికీ నిర్మాతగా కొనసాగుతూ వర్ధమాన నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయనే దాదా సాహెభ్ పాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ డి.రామానాయుడు. (బుధవావారం) ఇవాళ రోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా మూవీ మొఘల్ కి బర్త్ డే విషెష్ చెబుతూ ఆంధ్రావిశేష్.కాం అందిస్తోన్న స్పెషల్ స్టోరీ...
      1eప్రకాశం జిల్లా కారంచెడు గ్రామానికి చెందిన రామానాయుడు, సినిమా రంగం పట్లవున్న ఆసక్తితో మద్రాసు చేరుకొని నిర్మాణం దిశగా అడుగులు వేశారు. 1963 లో  'అనురాగం' అనే చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి నిర్మాతగా పరిచయమయ్యారు రామానాయుడు. ఆ సినిమా రిలీజ్ సమయంలో విపరీత మైన వర్షాలతో సమాజం అతలాకుతలమైన పరిస్థితి. దీంతో ఆ సినిమా ఆడలేదు.
      తన రెండవ సినిమాగా ఎన్టీఆర్ తో 'రాముడు - భీముడు' చిత్రాన్ని నిర్మించి తొలి విజయాన్ని అందుకున్నారు. అనంతరం ఆయన తీసిన ఆరు సినిమాలు పరాజయం పాలయ్యాయి. దీంతో ఇక తిరిగి పల్లెకు పోయి వ్యవసాయం చేసుకుందామని డిసైడైన తరుణంలో తీసిన  అక్కినేనిక 'ప్రేమ్ నగర్' సూపర్ డూపర్ హిట్ అయి రామానాయుడు చిత్ర సీమలో కొనసాగేలా చేసింది.
     ఇక ... శోభన్ బాబు కి 'సోగ్గాడు' కృష్ణకి 'సావాసగాళ్లు' వంటి తిరుగులేని విజయాలను అందించారు. ముఖ్యంగా ఆయన శోభన్ బాబు - కృష్ణ తో 'మండే గుండెలు' ... 'ముందడుగు' వంటి మల్టీ స్టారర్ చిత్రాలకి సైతం శ్రీకారం చుట్టారు. కాంతారావు ...  జగ్గయ్య ... కృష్ణంరాజు వంటి కథానాయకులతో పాటు, ఆ కాలం నాటి అందరు కథానాయికలకి అవకాశం కల్పించారు. ఇక ఆ తరువాత తరం వారైన చిరంజీవి ... బాలకృష్ణ ... నాగార్జున ... వెంకటేష్ లతో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకుల ముందుంచారు.
      ఈ తరం యువ కథానాయకులతో కూడా ఆయన తన సొంత బ్యానర్ పై చిత్రాలను నిర్మిస్తూనే వున్నారు. తెలుగు - తమిళ - మలయాళ -  కన్నడ - బెంగాలి - హిందీ ... ఇలా  ప్రస్తుతం నిర్మిస్తోన్నపంజాబీ చిత్రంతో కలిపి దాదాపు అన్ని భాషలలోను సినిమాలను నిర్మించిన ఘనత ఆయన సొంతం. నిర్మాత ఎలా వుండాలి అనే ప్రశ్నకి అందరూ కలిసికట్టుగా చెప్పే సమాధానంగా ఎదగడానికి కారణం ఆయన కృషి  ... పట్టుదల . ఇంతవరకూ 130 సినిమాలకి పైన నిర్మించి సక్సెస్ ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్నారు రామానాయుడు. త్వరలో దర్శకత్వ బాధ్యతలు సైతం నిర్వహించాలని ఉందంటోన్న ఇతని ఆకాంక్ష అతి త్వరలో నెరవేరి మంచి సినిమా రావాలని ఆశిద్దాం...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress meena rejects ram charan film offer
Young tiger badsha shooting cancel  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles