Namita attend a marriage function

namita attend a marriage function

namita attend a marriage function

25.gif

Posted: 06/04/2012 06:27 PM IST
Namita attend a marriage function

       సినీ తారలు ఏమి చేసినా అది ఓ సంచలనమే. ఈ విషయంలో తాను కూడా ఎవరికీ తీసిపోనని 'బొద్దు'గుమ్మ నమిత తాజాగా నిరూపించుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఓ పెళ్ళికి హాజరై అందరికీ షాక్ ఇచ్చింది.nami_e ఇంతకీ, అసలు విషయం ఏమిటంటే... తమిళనాడులోని కరూర్ పట్టణంలో నిన్న ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళింది అందాల కథానాయిక నమిత. చెన్నయ్ నుంచి తిరుచ్చి వరకు విమానంలో వెళ్లి, అక్కడి నుంచి కారులో కరూర్ బయలుదేరింది. మార్గమధ్యంలో ఓ గ్రామంలో దేవాలయం వద్ద పెద్ద సందడి కనిపించింది. దాంతో డ్రైవరుకి కారాపమని చెప్పి... సరాసరి నడుచుకుంటూ దేవాలయంలోకి వెళ్ళింది. ఆ సమయంలో అక్కడ ఓ జంటకు సంబంధించిన పెళ్లి సందడి ఆమె కంటపడింది. అంతే... అందర్నీ విష్ చేసుకుంటూ వివాహ వేదిక వద్దకు వెళ్లి, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు, తన మనీపర్సులోంచి కొంత మొత్తం తీసి పెళ్ళికానుక కూడా సమర్పించుకుంది. సినిమా యాక్టర్ నమిత ఏమిటి... అనుకోకుండా ఇలా తమ పెళ్ళికి రావడం ఏమిటి... ఇలా కానుక ఇవ్వడం ఏమిటి... అంటూ అక్కడి పెళ్లి వారు ఇంకా సంభ్రమాశ్చర్యాలలో మునిగి ఉండగానే ... అందరికీ బై చెప్పి కారెక్కేసింది ఈ అందాలబొమ్మ. ఇప్పుడీ సంఘటనతో నమిత తమిళుల మనసుల్ని అమితంగా దోచేసుకుందట. అదీ అభిమానుల మనసుదోచుకునే పద్దతి... ఏమంటారు...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kareena saif marriage date fixed
Prabhas new movie titled rudhra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles