A special story on maniratnam

a special story on maniratnam

a special story on maniratnam

35.gif

Posted: 06/03/2012 05:13 PM IST
A special story on maniratnam

       భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్న దర్శకుడు మణిరత్నం.   తమిళ ...   తెలుగు ... మలయాళ ... కన్నడ ... హిందీ చిత్ర పరిశ్రమలను తనదైన శైలిలో ప్రభావితం చేసిన ఘనత ఆయన సొంతం. సంఖ్యాపరంగా తక్కువే అనిపించినప్పటికీ ఆయన తీసిన చిత్రాలు గంగిగోవు పాలలాంటివి ... అరుదుగా లభించే అతి ఖరీదైన వజ్రాల లాంటివని చెప్పొచ్చు. ఇమేజ్ ఉన్న హీరోలని ఎంపిక చేసుకోవడం ... వాళ్లకి తగినట్టుగా కథని తయారు చేసుకోవడం మణిరత్నానికి తెలియదు. ప్రతి సినిమాకి ఆయనే కథని తయారు చేసుకుంటారు. ఆ కథకి సరిపోతారనుకునే ఆర్టిస్టులనే ఆయన తీసుకుంటారు.
      mani  కథ ... కథనం ... పాటలు ... చిత్రీకరణ ... ఇలా అన్ని అంశాలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా లైటింగ్ ... ఫ్రేమింగ్ చూసి అది మణిరత్నం సినిమా అని చెప్పేయవచ్చు. ఆయన సినిమాల్లో వినోదంతో పాటు సమాజానికి సంబంధించిన ఓ సమస్య ... దాని పరిష్కారం కూడా ఉంటాయి. 'నాయకుడు' ... 'దళపతి' ... 'బొంబాయి' ... 'రోజా' ... 'దిల్ సే' వంటి చిత్రాలు ఈ కోవలోకే వస్తాయి. ఈ సినిమాలు చూసిన వాళ్లంతా ఓ సున్నితమైన అంశాన్ని కథా వస్తువుగా తీసుకుని దానిని అందంగా ... అర్ధవంతంగా ... సమర్ధవంతంగా తెరకెక్కించడం ఆయనకి మాత్రమే సాధ్యమని ఒప్పుకుంటారు.
        తెలుగులో ఆయన తెరకెక్కించిన 'గీతాంజలి' ప్రేమకథా కావ్యాల్లో ఎప్పటికీ తలమానికంగానే నిలిచి వుంటుంది. ఎప్పుడూ చిరునవ్వుతో చాలా సాదాసీదాగా కనిపించే మణిరత్నం, దర్శక నిర్మాతగా ... స్క్రీన్ ప్లే రచయితగా అందుకున్న అవార్డులు ఎన్నో ... ఎన్నెన్నో ..! అగ్ర దర్శకుల జాబితాలో ముందువరుసలో కనిపించే ఆయన నిజంగా మణి'రత్నమే'. ఆయన పుట్టిన రోజును శనివారం అతని అభిమానులు దేశవ్యాప్తంగా ఓ పండుగలా జరుపుకున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Special story on ilayaraja
I would love to work with puneet rajkumarmanchu laxmi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles