Bollywood star amir khan will meet pawan kalyan and maheshbabu

bollywood star amir khan will meet pawan kalyan and maheshbabu..?

bollywood star amir khan will meet pawan kalyan and maheshbabu..?

7.gif

Posted: 05/29/2012 06:23 PM IST
Bollywood star amir khan will meet pawan kalyan and maheshbabu

       అమీర్ ఖాన్ సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అతను ఏ ప్రాజక్ట్ పట్టుకున్నా అందులో విషయం ఉండకుండా ఉండదు.amir_e1 సినిమాల్లో ఇది ఎప్పుడో నిరూపించబడింది. ఇక తాజాగా అమీర్ నిర్వహిస్తోన్న 'సత్యమేవ జయతే' కార్యక్రమం జాతీయ స్థాయిలో అశేష ప్రేక్షకులని ఇంటింటికీ వచ్చిమరీ బుల్లితెర మీద అలరిస్తోంది. దాదాపు 100 దేశాలలో 8  భాషలలో ప్రసారమౌతోన్న ఈ కార్యక్రమం ప్రతి మనిషినీ కదిలిస్తోంది. ప్రతి మనసుని ఆలోచింపజేస్తోంది. ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహిస్తోన్న అమీర్ ఖాన్ దృష్టి ఇప్పుడు మహేష్ బాబు ... పవన్ కల్యాణ్ లపై పడినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇతర భాషల్లో 'సత్యమేవ జయతే' కార్యక్రమం అమీర్ ఖాన్ డబ్ వాయిస్ తో ప్రసారమౌతోంది. అయితే ఆయా ప్రాంతాలకి సంబంధించిన అగ్ర కథానాయకులతో ఈ కార్యక్రమానికి వాయిస్ ఓవర్ చెప్పించి నట్టైతే ఈ కార్యక్రమానికి మరింత మైలేజ్ కలిసి వస్తుందని అమీర్ ఖాన్ భావించాడట.pawa_e ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన కేరళ వెళ్లి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని అక్కడి వాయిస్ ఓవర్ కి ఒప్పించినట్టు తెలుస్తోంది.
       ఇక తెలుగులో మహేష్ బాబు - పవన్ కల్యాణ్ లలో ఎవరినో ఒకరిని కలిసి ఈ కార్యక్రమానికి వాయిస్ ఓవర్ చెప్పమని అడిగేందుకు అమీర్ ఖాన్ హైదరాబాద్ రానున్నాడని అంటున్నారు. అయితే వీరిద్దరిలో ఆయన ఎవరిని కలుస్తాడనేది మాత్రం గోప్యంగా ఉంచారు. ఈ కార్యక్రమం సామాజిక స్పృహ కి సబంధించింది కాబట్టి, వీరిద్దరిలో ఎవరైనా అంగీకరిస్తారని తెలుస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manchu manoj in duel role in news movie
Anand sai sets for ram charan marriage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles