Evadu seetamma vakitlo cirimalle chettu producer dil raju tension

evadu seetamma vakitlo cirimalle chettu producer dil raju tension

evadu seetamma vakitlo cirimalle chettu producer dil raju tension

9.gif

Posted: 05/24/2012 04:36 PM IST
Evadu seetamma vakitlo cirimalle chettu producer dil raju tension

       ఖర్మకాలితే తప్ప.. సామాన్యంగా అపజయాన్ని దరి చేరనివ్వని నిర్మాత దిల్ రాజు. ఈనకు సినిమా సక్సెస్ సూత్రం బాగా తెలిసిన వ్యక్తిగా టాలీవుడ్ లో పేరుంది. దిల్ రాజు ప్రస్తుతం పెద్ద హీరోలతో రెండు సినిమాలు తీస్తున్న విషయం మనకు తెలిసిందే. వీటిలో ఒకటి 'సీతమ్మ వాకిట్లో...' కాగా,dil_2 మరొకటి 'ఎవడు' చిత్రం. ఇప్పటికే 'సీతమ్మ వాకిట్లో...' సినిమా కోసం మహేష్ బాబు ఇచ్చిన డేట్స్, సరైన షూటింగు ప్రణాళిక లేక చాలా వరకు వేస్ట్ అయ్యాయట. ప్రకాష్ రాజ్ పాత్ర విషయంలో వివాదం, సమంతా అనారోగ్యం వల్ల... షూటింగుకి అంతరాయం కలిగింది. దీంతో మహేష్, వెంకటేష్ ల డేట్స్ వృథా అయ్యాయని అంటున్నారు.
 దీంతో ఈ సినిమా షూటింగు విషయంలో దిల్ రాజుకి మహేష్ బాబు వార్నింగ్ కూడా ఇచ్చాడని ఓ కథనం ప్రచారంలో వుంది.  ఆగస్టు నెలాఖరు లోగా తనకి సంబంధించిన సీన్స్ పూర్తి చేసుకోమనీ ...ram సెప్టెంబర్ నుంచి తన డేట్స్  సుకుమార్ కి ఇచ్చానని దిల్ రాజు తో మహేష్ బాబు తేల్చి చెప్పాడని అంటున్నారు. ఒక వేళ ఆలోగా పూర్తి చేయలేకపోతే, తిరిగి తన డేట్స్  ఏడాది చివరిలో ఇస్తానని చెప్పడంతో దిల్ రాజుకి  టెన్షన్ పట్టుకుందట. దాంతో సాధ్యమైనంత త్వరగా మహేష్ కాంబినేషన్ సీన్స్  పూర్తి చేసే పనిలో పడిపోయాడని తెలుస్తోంది.
        ఇదిలా ఉంచితే, 'ఎవడు' సినిమా విషయంలో కూడా ఇదే సమస్య ఎదురవుతోందట. ఇందులో రాంచరణ్, అల్లు అర్జున్ నటిస్తున్న సంగతి మనకు తెలుసు. ఇక్కడ కూడా షూటింగు అనుకున్నట్టుగా జరగడం లేదని వార్తలు వస్తున్నాయి. చరణ్ మరోపక్క ఇతర సినిమాలకు డేట్స్ కేటాయించాల్సిన పరిస్థితి వుంది. అలాగే, అల్లు అర్జున్ కూడా ఇతర ప్రాజక్టులతో బిజీ అవుతున్నాడు. వీరిద్దరూ ఈ సినిమాకు ఇచ్చిన డేట్స్ లోనే 'ఎవడు' సినిమా పూర్తి కావాలి. ఒకవేళ పూర్తి చేసుకోలేని పక్షంలో ప్రాజక్టు ఆలస్యమైపోతుంది.
        ఇప్పుడు రెండు క్రేజీ ప్రాజక్టులు చేస్తున్నానన్న ఆనందం ఓపక్క ఉన్నప్పటికీ... ఇవి ఏలా పూర్తవుతాయో అన్న మీమాంస దిల్ రాజును పట్టిపీడుస్తుందట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balayya adittya 369 coming again
Jagan story in krishna vamsi movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles