Gopi chand hopes on his forth coming movie

gopi chand hopes on his forth coming movie

gopi chand hopes on his forth coming movie

23.gif

Posted: 05/23/2012 05:24 PM IST
Gopi chand hopes on his forth coming movie

      గోపీచంద్ కు సినీ పరిశ్రమలో మంచి పేరుంది. సినిమాల్లో హీరోగా అడుగుపెట్టి... ఆ తరువాత విలన్‌గా మారి... మళ్లీ హీరోగా తన టాలెంట్‌ ప్రూవ్ చేసుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు తన కెరీర్‌లోనే క్లిష్ట పరిస్థితి ఎదుర్కుంటున్నాడు. వరుస ఫ్లాప్స్‌లో సతమతమవుతున్నాడు. హిట్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్న గోపిచంద్... gopi_eఇప్పుడు తన ఆశలన్నీఅప్‌కమింగ్ మూవీ 'జగన్మోహన్ ఐపీఎస్‌'పైనే పెట్టుకున్నాడు. కోలీవుడ్ దర్శకుడు భూపతి పాండ్యన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్నఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్నఈ సినిమా త్వరలోనే రెండో షెడ్యూల్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఇక ఈ సినిమాలో గోపిచంద్ ఓ పవర్‌ఫుల్ ఐపీఎస్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే శౌర్యం, గోలీమార్ సినిమాల్లో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఈ మాస్ హీరో... మరోసారి పోలీస్ గెటప్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని డిసైడయ్యాడు. నయనతార హీరోయిన్‌గా నటించడం ఈ సినిమాకు ప్లస్‌ అవుతుందేమో చూడాలి.
      ఇదిలా ఉంటే.. ఈ సినిమాతో కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు గోపిచంద్. ఈ సినిమా దర్శకుడు భూపతి పాండ్యన్ కు కోలీవుడ్‌లో మంచి ట్రాక్ రికార్డ్ ఉండటంతో పాటు నయనతారకు తమిళంలో క్రేజ్ ఉండటంతో... ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకే సారి విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. గోపీచంద్ అప్‌కమింగ్ మూవీ సక్సెస్ సాధించాలని మనమూ కోరుకుందాం. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh bandla ganesh and puri jagannath combi
Shekar kammula life is beautiful movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles