Madonna wants rahman

madonna wants rahman

madonna wants rahman

14.gif

Posted: 05/21/2012 06:39 PM IST
Madonna wants rahman

      mado_ee మ్యూజిక్ మాంత్రికుడు రెహ్మానే కావాలంటోంది ఎవర్ గ్రీన్ అందాల రాశి. విషయంలోకి వెళితే.. సంగీత ప్రియులకు పాప్ గాయని మడోనా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 54 ఏళ్ల వయసులో కూడా వన్నె తరగని అందంతో... సంగీత ప్రపంచంలో ఆమె తనదైన ముద్ర వేస్తోంది. అందుకే ఆమెతో పనిచేయాలని ప్రతి సంగీత కళాకారుడూ కోరుకుంటాడు అంతేకాదు అదో వరంలా భావిస్తాడు కూడా..
      అయితే, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ.. మడోన్నా సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ తో కలిసి పనిచేయాలని ఆశిస్తోంది. 'రెహ్మాన్ తో కలిసి పనిచేయాలని వుంది. ఆ చాన్స్ వస్తే కనుక మా నుంచి ఓ మంచి మ్యూజిక్ ఆల్బం వస్తుంది' అంటోంది మడోనా. mado_eee
      అలాగే, అతని ప్రతిభను ఆమె వేనోళ్ల పొగుడుతూ మాట్లాడేసరికి రెహ్మాన్ ఇప్పుడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడు. 'ఆమెతో కలిసి పని చేయడానికి మించిన ఆనందం ఇంకేం వుంటుంది? అంతటి గాయని నా గురించి ఇన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను' అంటున్నాడు రెహ్మాన్. వీరి కలయికలో త్వరలోనే ఓ సెన్సేషనల్ ఆల్బం వీనులవిందు చేయబోతుందన్నమాట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajani shankar combi coming
Raja mouli eega release date  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles