Nagarjuna bhai movie report

nagarjuna bhai movie report

nagarjuna bhai movie report

13.gif

Posted: 05/16/2012 04:59 PM IST
Nagarjuna bhai movie report

      ఆమధ్య నాగ్ తో ‘భాయ్’ సినిమా రాబోతుందని వార్తలు వచ్చాయి. అనంతరం ఈ సినిమా సోదిలో లేకుండా పోయింది. తాజాగా మళ్లీ ఈ సినిమా నిర్మాణానికి మార్గం సుగమం అయినట్టు అగుపిస్తోంది.na_eeee ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించవలసి ఉన్న ఎం.ఎల్.కుమార్ చౌదరి, ‘భాయ్’ కన్నా ముందు ప్రాజెక్ట్ గా 'అధినాయకుడు' చిత్రాన్ని నిర్మించారు.  ఈ సినిమా బడ్జెట్ పరంగా ఆయన్ని ఆర్ధికంగా దెబ్బతీయడంతో, ఇక ఇప్పట్లో ఆయన మరో చిత్రాన్ని నిర్మించే పరిస్థితుల్లో లేడనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నాగార్జున కాస్త చొరవ తీసుకుని, నిర్మాతగా డీవీవీ దానయ్యని రంగంలోకి దింపి లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున 'శిరిడీ సాయి' చిత్రం షూటింగ్ లో బిజీగా వున్నారు. దీని తరువాత ఆయన దశరథ్ దర్శకత్వం వహిస్తోన్న 'లవ్ స్టోరీ' సినిమాతో పాటు, 'భాయ్' చిత్రం షూటింగ్ లోకూడా పాల్గొంటారని తెలుస్తోంది.
     'అహ నా పెళ్ళంట' ... 'పూలరంగడు' వంటి హాస్య ప్రధాన చిత్రాలకి విజయాన్ని సంపాదించి పెట్టిన దర్శకుడు వీరభద్రం చౌదరి, తన తదుపరి చిత్రాన్ని 'భాయ్' పేరుతో నాగార్జునతో రూపొందించడానికి ఇక లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nandamoori natasimham balayya babu journalism
Sunil and naga chaitanya brothers relation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles