Nagarjuna damarukam movie in trouble

nagarjuna damarukam movie in trouble

nagarjuna damarukam movie in trouble

17.gif

Posted: 05/15/2012 06:07 PM IST
Nagarjuna damarukam movie in trouble

       డమరుకం పేరుకు ఇప్పుడు పోటీ పెరిగిపోయింది. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్ పై నాగార్జున హీరోగా 'డమరుకం' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గ్రాఫిక్స్ కి సంబంధించిన పనులు జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది.dae ఈ నేపథ్యంలో 'డమరుకం' పేరుతో మరో తెలుగు సినిమా నిర్మాణం జరుగుతూ వుండటం వివాదానికి దారితీసింది.
 ఆర్నవ్ మూవీస్ బ్యానర్ పై ప్రమోద్ కుమార్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి నవీన్ కళ్యాన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సామాజిక సమస్యల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం తలెత్తిన ఈ వివాదం గురించి ఈ దర్శక నిర్మాతలు మీడియా ముందుకొచ్చారు.
        2008 ఫిబ్రవరి 22 న 'డమరుకం' టైటిల్ ని ఎ.పి.ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేయించినట్టు చెప్పారు. 50 % చిత్రీకరణని జరిపాక అనుకోని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయిందనీ.. ఆ సమయంలో టైటిల్ ని రెన్యువల్ చేయించామని అన్నారు. ఇప్పుడదే టైటిల్ తో ఆర్.ఆర్. మూవీమేకర్స్ చిత్రం వస్తోండటంతో, తమకి ఫైనాన్స్ నిలిచిపోయిందని చెప్పారు. మిగతా షూటింగ్ పూర్తి చేసి జూన్లో ఈ సినిమాని విడుదల చేస్తామని అన్నారు.
      ఈ విషయమై కోర్టుకి వెళ్లగా ... ఇంగ్లిష్ టైటిల్ కి సంబంధించి రెండు టైటిల్స్ లోను అక్షరాల తేడా ఉన్నందున అభ్యంతరం లేదని కోర్టు తేల్చేసిందని చెప్పారు. ఇక ఈ వివాదం సంగతి అలా ఉంచితే, ఇంచుమించు ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే అందరిలోనూ గందరగోళం ఏర్పడే అవకాశం వుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gantotri and badrinath movie stories get award
Sunil and young hero siddarth multi starer movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles