Sruthi hassan about gabbar singh

sruthi hassan about gabbar singh

sruthi hassan about gabbar singh

11.gif

Posted: 05/15/2012 03:56 PM IST
Sruthi hassan about gabbar singh

     నటించిన సినిమాలన్నీ బాక్సీఫీస్ వద్ద బోల్తా పడటంతో గబ్బర్ సింగ్ మీదే ఆశలు పెట్టుకున్న అందాల భామ శ్రుతి హాసన్ కల మొత్తానికి నెరవేరింది.sruthiff పవన్ కళ్యాణ్ తో జోడీ కట్టిన ఈ సుకుమారి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయ ఢంకా మ్రోగిస్తుండటంతో శ్రుతి ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఈ సినిమా విజయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘గబ్బర్‌సింగ్’ సినిమాకు సైన్ చేసినప్పుడే ఈ సినిమా నాకు హిట్‌ని ఇస్తుందనిపించింది. అయితే.. ఇంత హిట్‌ని మాత్రం ఊహించలేదు.  ఈ విజయానికి ప్రధానకారకుడు పవర్‌స్టార్. ఇది  ఆయన విజయమే. తర్వాతే ఎవరైనా. ఏదిఏమైనా నా యూనిట్ సభ్యులందరికీ పేరుపేరున కంగ్రాట్స్ చెబుతున్నాను అంటోంది శ్రుతి.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వస్తోన్న ఆదరణ, కలెక్షన్లు చూసి ఆశ్చ్యమేస్తుంది అని శ్రుతి వెల్లడించింది.
       గబ్బర్ సింగ్ విజయంతో ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్ అభిమానులయితే మళ్లీ పవన్ కళ్యాణ్ తోనే సినిమా తీయాలంటూ అనేక మంది సందేశాలు పంపుతున్నారు. పవన్ తో నటించటం నా లక్ గా భావిస్తున్నాను. అయితే చివరిగా మీడియామీద ఓ బాంబు పడేసిందీ చిన్నది.  మొన్నటిదాకా ‘ఐరన్‌లెగ్’ అన్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి ‘గోల్డెన్‌లెగ్’ అంటున్నారు. పరిస్థితులను బట్టి మార్చుకునే అభిప్రాయాలను నేను అస్సలు పట్టించుకోనంటూ మీడియాకు అఖరున చురకంటించిందీ సుందరి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunil and young hero siddarth multi starer movie
Gabbar singh director harish shankar remuneration  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles