Daruvu postponed to may 25

Daruvu news, indian movie Daruvu news, Daruvu latest news, Daruvu latest news blog post

Ravi Teja, Taapsee starrer Daruvu has been postponed to the third week of May 25

Daruvu postponed to May 25.GIF

Posted: 05/11/2012 04:27 PM IST
Daruvu postponed to may 25

Dharuvu

సినిమా అంతా కమర్షియల్ అయిపోయిన ఈ రోజుల్లో వచ్చే సినిమాలు సాధారణ బడ్జెట్ లో రావడం లేదు. ఐదు పది కోట్లను దాటి ఏకంగా 40 నుండి 45 కొట్లు పెట్టి తీస్తున్నారు. అందులో పెద్ద హీరోలైతే ఇంకా చెప్పనక్కర్లేదు. పెద్ద హీరోలు అనేగానే కోట్లకు కోట్లు కుమ్మరించి సినిమాలు తీసి తరువాత పెట్టిన సొమ్మును రాబట్టుకోవడానికి కొన్ని సినిమాల విడుదలకు అడ్డు పడతుంటారు. అంతే కాకుండా చిన్న నిర్మాతలకు కూడా పెద్ద హీరోలు అనగానే పెట్టిన బడ్జెట్ ఎక్కడ రాకుండా పోతుందో అని భయపడి చిన్న సినిమాల రిలీజును ఆపేస్తుంటారు.  ఇక ఇప్పుడు విడుదలకి సిద్ధంగా ఉన్న సినిమాలపై 'గబ్బర్ సింగ్' ఎఫెక్ట్ ఎక్కువగానే పడుతోంది. రామ్ - తమన్నా జంటగా తెరకెక్కిన 'ఎందుకంటే ప్రేమంట' చిత్రం కూడా ఈ నెల 11 న రిలీజ్ కావాల్సిందే.

అయితే 'గబ్బర్ సింగ్' విడుదల అదే రోజు ఉండడంతో, 'ఎందుకంటే ప్రేమంట' సినిమా తన రిలీజ్ ని వాయిదా వేసుకుంది. ఇప్పుడదే కోవలోకి 'దరువు' సినిమా కూడా వచ్చినట్టు చెబుతున్నారు. రవితేజా - తాప్సీ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమాని ఈ నెల 4 వ తేదీన విడుదల చేయాలనుకున్నప్పటికీ, అనుకోకుండా ఆ డేట్ ఈ నెల 18 కి మారింది. రవితేజా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సమయంలో, ఇప్పుడా తేదీ 25 కి మారిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడమే కారణమని పైకి చెబుతున్నప్పటికీ, 'గబ్బర్ సింగ్' ఎఫెక్టే అనే వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sneha and prasanna get married
Hansika affair with ram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles