Megastar chiranjeevi 150th film title here

megastar chiranjeevi 150th film title here

megastar chiranjeevi 150th film title here

19.gif

Posted: 05/03/2012 03:11 PM IST
Megastar chiranjeevi 150th film title here

22
chiru             దాదాపు ఏడాది కాలంగా, మెగా అభిమానులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజానీకం ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తోన్న తరుణం ఆసన్నమైంది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు అడుగులు ఒక్కొక్కటిగా పడుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రతీ అప్డేట్ ఇన్ఫర్మేషన్.. ఆంధ్రావిశేష్.కాం అందిస్తూ వస్తున్నట్టుగానే, అందరికంటే ముందుగా మా ప్రేక్షకులకు చిరు సినిమా టైటిల్ కూడా వెల్లడిస్తున్నాం. అదే ‘నాయకుడే సేవకుడైతే’.

         తనే చిరంజీవి సినిమాకు ప్రొడ్యూసర్ నని ప్రకటించి, సొంత నిర్మాణ సంస్థ ‘లియో ప్రాజక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ నెలకొల్పారు చిరు తనయుడు..మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఇవాళ ఇదే సంస్థ ‘నాయకుడే సేవకుడైతే’ అనే పేరుతో ఓ టైటిల్ రిజిస్టర్ చేసింది. 
       ఇటీవల కాలంలో మారుతోన్న రాజకీయపరిణామాల నేపధ్యంలో, కాంగ్రెస్ అధిష్టాన దూత వాయలార్ రవి చిరుతో భేటీ అయి ప్రధానంగా చిరు 150వ సినిమా గురించి చర్చించిన సంగతి మనకు తెలుసు. ఒక పవర్ ఫుల్ అండ్ స్ట్రాంగ్ సోషల్ ఓరియంటెడ్ సినిమా తీయాలని సోనియా కూడా ఆశిస్తున్నట్టు రవి ..చిరుకు విన్నవించారు.
          అనంతరం.. ‘ప్రజలకు చెప్పేటందుకు సినిమా ఒక మంచి సాధనం’ అని చిరు కూడా ఒక సందర్భంలో చెప్పారు.  దీంతో ఈ సినిమా నిర్మాణం చక చకా సాగుతున్నట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించి క్రిత వారం దర్శకుడు వివి వినాయక్ చిరును కలిసి చర్చించారు. చరణ్ ప్రస్తుతం జంజీర్ చిత్ర షూటింగ్ లో ఉన్నారు. ఈ మూవీ పూర్తి అయిన తర్వాత సెప్టెంబర్ లో ఈ చిరు సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. 
         మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ రీ ఎంట్రీకి సరిగ్గా సూటబుల్ టైటిల్ ‘నాయకుడే సేవకుడైతే’....

21

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sneha marriage twice with prasanna
Sana khan arrest for prostitution  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles