May second weak kaarti movie sekuni movie audio release

may second weak kaarti movie sekuni movie audio release

may second weak kaarti movie sekuni movie audio release

9.gif

Posted: 04/27/2012 04:06 PM IST
May second weak kaarti movie sekuni movie audio release

        kaarti_inn తమిళ హీరో సూర్య ఇప్పటికే టాప్ హీరోల జాబితాలో చేరిపోగా, తమ్ముడు కార్తీ కూడా ఇప్పుడు చేరిపోతున్నాడు. ఇంతవరకు అతను నటించిన చిత్రాలన్నీ కూడా బాక్సాఫీసు దగ్గర విజయాలు సాధించినవే కావడం విశేషం. ఈ నేపథ్యంలో తాజాగా కార్తీ నటిస్తున్న 'శకుని' చిత్రం తమిళనాడు ధియేటరల్ హక్కులు 23 కోట్లకు హాట్ కేక్ లా అమ్ముడుపోవడం కోలీవుడ్ మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
      మరోపక్క తెలుగు వెర్షన్ కి కూడా మంచి రేటు వచ్చినట్టు చెబుతున్నారు. సమకాలీన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి శంకర్ దయాళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రణీత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రాధిక, రోజా, కోట శ్రీనివాసరావు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్ నెలలో దీనిని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి, విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తున్న ఈ చిత్రం రేపు విడుదలయ్యాక ఎలాంటి సంచలనానికి తెరలేపుతుందో చూడాలి. Karthi_saguni_hyd
          కాగా కార్తి హీరోగా నటిస్తున్న ‘శకుని’ చిత్ర ఆడియో మే నెల రెండవ వారంలో విడుదల కానుంది. తమిళ్ మరియు తెలుగు రెండు భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ చిత్ర ఆడియో కూడా ఇరు భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ మరియు ‘బావ’ వంటి చిత్రాల్లో నటించిన ప్రణిత హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి శంకర్ దయాల్ దర్శకుడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్లో విడుదల కావాల్సి ఉండగా తమిళనాడు సినీ పరిశ్రమ సమ్మె కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. రాజకీయాల మీద వ్యంగాత్మకంగా తీసిన ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ సురేష్ విడుదల చేయనున్నారు. కార్తి గత సినిమాలు అవర, యుగానికి ఒక్కడు, నా పేరు శివ వంటి సినిమాలు తెలుగులో విజయం సాధించడంతో ఈ సినిమా పై కూడా క్రేజ్ బాగానే ఉంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Old actress kanchana life on silver screen
Young tiger ntr dammu movie review  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles