Top producer aswini dutt make a film with raviteja

top producer aswini dutt make a film with raviteja

top producer aswini dutt make a film with raviteja

8.gif

Posted: 04/10/2012 04:00 PM IST
Top producer aswini dutt make a film with raviteja

          ravi_inn11 మాస్ మహరాజా రవితేజ సారొస్తారు. త్వరలోనే.. ఎక్కడికి అనుకుంటున్నారా.. మరో కొత్త సినిమాతో మీముందుకు... ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనిదత్ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మించబోతోంది.  అయితే ఈ చిత్ర టైటిల్ సరికొత్తగా.. ఈ మధ్య అందరి నోళ్లలోనూ నానుతున్నపాటనే మూవీ టైటిల్ గా పెట్టారు. ప్రిన్స్ మహేష్ బాబు ‘బిజినెస్ మాన్’ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంపోజ్ చేసిన పాట ‘‘సా...రొస్తా..రొస్తారా ’’అనే పాటే ఈ టైటిల్ కు ప్రేరణగా కనిపిస్తోంది.
        కాగా, ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించబోతున్నారు. ఇంతకుముందు పరశురామ్ ‘యువత’, ‘సోలో’ చిత్రాలను రూపొందించారు. రవితేజతో తీస్తున్నచిత్రం పరశురామ్ సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మూవీ జులై నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ చిత్రం మీద సినీ వర్గాల్లో విశేష స్పందన మొదలైంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nag wife amala re entry into tollywood
Famous film personalities in akkineni platinum jublee celebrations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles