Super hit movie gajani director murugudas new movie tupaaki

super hit movie, gajani, director, murugudas new movie tupaaki

super hit movie gajani director murugudas new movie tupaaki

13.gif

Posted: 03/16/2012 04:58 PM IST
Super hit movie gajani director murugudas new movie tupaaki

         murugu అమీర్‌ఖాన్‌తో చేసిన 'గజిని' సినిమాతో బాలీవుడ్‌లోకి సైతం ఘనంగా అడుగు పెట్టిన తమిళ దర్శ కుడు ఎ.ఆర్‌.మురుగదాస్‌ త్వరలో రెండో సినిమాని కూడా బాలీవుడ్‌లో చేయబోతున్నాడు. ఈసారి ఆయన హీరోగా అక్షరు కుమార్‌ని ఎంచుకున్నాడు. ఇది కూడా రీమేకే కావడం గమనార్హం. ప్రస్తుతం విజరు హీరోగా తమిళంలో 'తుపాకి' సినిమాని రూపొందిస్తున్నాడు మురుగదాస్‌. తెలుగులోనూ అదే పేరుతో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమానే అక్షరుతో ఆయన రీమేక్‌ చేయబోతున్నాడు. ఓ చిన్న గ్రామం నుంచి ముంబై వెళ్లి అక్కడ డాన్‌ అవతారమెత్తిన ఓ యువకుడి కథ ఈ సినిమా.
          కాగా, ప్రస్తుతం అక్షరు అనేక సినిమాలతో బిజీగా ఉన్నాడు. ' ఓ మై గాడ్‌', 'కిలాడి 786', 'రౌడీ రాథోడ్‌', మలయాళంలో మమ్ముటి నటించిన 'పోకిరి బ్రదర్స్‌' రీమేక్‌, ' ఒన్స్‌ అపాన్‌ ఎ టైం ఇన్‌ ముంబై' సీక్వెల్‌, అశ్విన్‌ వర్దే డైరెక్ట్‌ చేసే మరో సినిమా... అన్ని సినిమాలు చేస్తూ కూడా మురుగదాస్‌ సినిమా చేయనుండటం విశేషమే.
          దీనిగురించి అక్షరు ఇచ్చే వివరణ ఇలా ఉంది.. ‘‘ఇన్ని సినిమాలు ఎలా చేస్తున్నానా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. నేను గనక ఇన్ని చేయలేకపోతే అసలు ఒప్పుకునేవాణ్ణేకాదు. అందుకే దీన్ని నెగిటివ్‌గా కాకుండా పాజిటివ్‌ దృష్టితో చూడండి. మాలాంటి హీరోలు ఎన్ని ఎక్కువ సినిమాలు చేస్తే అంత ఎక్కువగా కార్మికులకి ఉపాధి కల్పించిన వాళ్లమవుతాం'' అంటున్నాడు అక్షరు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Alphonsa to be arrested
Director teja talk about neku naku dash dash movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles