Prince mahesh babu voice over for banne movie

prince mahesh babu ,voice over ,for banne movie

prince mahesh babu voice over for banne movie

1.gif

Posted: 03/16/2012 12:34 PM IST
Prince mahesh babu voice over for banne movie

          arjun_inn స్టైలిష్ స్టార్ బన్నీ సినిమాలో ప్రిన్స్ మహేష్ మాటల తూటాలు పేలితే డబుల్ ధమాకాలా ఉంటుంది కదా.. అదే త్వరలో సాక్షాత్కరిచబోతోంది. ఇరు హీరోల అభిమానులకు ఇది ఆనందకరవార్తే.   త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఇలియానా, అల్లు అర్జున్ హీరో హీరోయిన్లుగా ఓ సరికొత్త సినిమా రూపొందుతున్న విషయం విదితమే. ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ని మహేష్ బాబు చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాన్ తో త్రివిక్రమ్ చేసిన 'జల్సా' చిత్రానికి కూడా మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.mahesh
            ఈ సినిమాకి చెందిన మరో ఆసక్తి కరమైన వార్త ఏమిటంటే, ప్రస్తుతం  ప్రస్తుతం ఈ చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయ స్టుడియోలో జరుగుతున్నాయి. అల్లు అర్జున్ ఈ చిత్రంలో తన పాత్రకి డబ్బింగ్ చెబుతున్నాడు. ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. సోనూసూద్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Superstar rajani kanth new movie kochhadiyan
Rana and natalia hot hot pics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles