Sneha getting married on 11 may

Sneha,Prasanna Sneha wedding,Prasanna,Sneha,Prasanna Sneha wedding,Prasanna

Finally, Prasanna and Sneha have decided on their wedding date

Sneha getting married on 11 May.gif

Posted: 03/10/2012 06:16 PM IST
Sneha getting married on 11 may

Prasanna_sneha

2012 సంవత్సరం సినీ తారల పెళ్ళి సంవత్సరం అని చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో అనేక మంచి సినీ తారలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, చేసుకుంటున్నారు. త్వరలో మరో భామ మూడు ముళ్ళు వేయించుకోవడానికి మూహుర్తం పెట్టుకుంది. తెలుగులో బోలెడంత మంది అభిమానులను తన అందంతో, అభినయంతో ఆకట్టుకున్న స్నేహా పెళ్ళి ముహూర్తం ఖరారైంది. ఈ భామ మే 11 వ తేదీన పెళ్ళి కూతురు కాబోతుంది.

ఈమె వివాహం తమిళ నటుడు ప్రసన్నతో ఖారైరైన విషయం తెలిసిందే. ఈ వివాహం చెన్నైలోని ‘‘శ్రీ వెంకట చలపతి కళ్యాణ మంటపంలో’’ అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకి సినీ పరిశ్రమకి సంబంధించిన ప్రముఖులతో పాటు చాలా మంది వీఐపీలను ఆహ్వానించనున్నట్లు తెలుస్తుంది.

తెలుగులో 'ప్రియమైన నీకు' ... 'శ్రీ రామదాసు' ... 'రాధాగోపాళం' వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇటు సినిమాల్లోనే కాకుండా వాణిజ్య ప్రకటనల్లో నటించి మంచి ఇల్లాలుగా పేరు తెచ్చుకున్న స్నేహా మే 11న ఇల్లాలు కాబోతుంది. మరి స్నేహ వివాహ జీవితం సుఖంగా, రసమయంగా ఉండాలని మనందరం ఆకాక్షిస్తూ.....

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan tej rachha audio release today
Anushka replaced trisha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles